జూన్ 30 వరకు వాటిపై నిషేధం విధిస్తూ యూపీ సర్కార్ కీలక నిర్ణయం
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ యూపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది . ఉత్తర ప్రదేశ్ లో ఇప్పటి వరకు 1621కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 25మంది మరణించారు . ఇక కరోనా వైరస్ ప్రబలుతున్న నేపధ్యంలో కరోనా కట్టడికి అన్ని రాష్టాల ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇక యూపీలో కూడా కరోనా కట్టడి చర్యలు చేపడుతూనే పలు కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ .
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, బాధితులకు అందుతున్న వైద్య సహాయాలపై , పెరుగుతున్న కేసుల నేపధ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగానే అధికారులు, వైద్య సిబ్బంది సూచనల మేరకు జూన్ 30 వరకు సభలూ, సమావేశాలపై నిషేధం విధించారు. ఇక దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆంక్షల నుంచి సడలింపులు ఇస్తున్న తరుణంలోనే యూపీ ప్రభుత్వం మాత్రం కరోనా వ్యాప్తి విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది.

Recommended Video
కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను పాటిస్తూనే వైరస్ నియంత్రణకు కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా కట్టడికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే వలస కూలీలను తిరిగి స్వరాష్ట్రానికి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తుంది . ఇక తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 30 వరకు రాష్ట్రంలో సభలు, సమావేశాలపై నిషేధం విధించింది. జూన్ 30 వరకు పెద్ద సంఖ్యలో జనం ఎక్కడా ఉండకూడదని, ఎలాంటి సభలు , సమావేశాలకు అనుమతి ఇవ్వరాదని నిర్ణయించింది . ఇక దీని గురించి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో తదుపరి పరిస్థితిని బట్టి కరోనా నియంత్రణ పరిస్థితిని బట్టి నిషేధంపై చర్యలు తీసుకుంటామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.












Click it and Unblock the Notifications