Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: కాన్ఫు కోసం వెళ్లిన మహిళ, 50 రోజుల బిడ్డను చంపేసి తల్లి ఆత్మహత్య, విలన్ ఎవరంటే !

చెన్నై/ విల్లుపురం: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చేసి గర్బవతి అయ్యింది. మొదటి కాన్ఫు కావడంతో ఆమె డెలవరీ కోసం పుట్టింటికి వెళ్లింది. 50 రోజుల క్రితం ఆడబిడ్డకు జన్మనిశ్చింది. బాలింత ఆమె బిడ్డతో కలిసి పుట్టింటిలోనే నివాసం ఉంటున్నది. మహిళ కుటుంబ సభ్యులు పని మీద బయటకు వెళ్లారు. కుటుంబ సభ్యులు తిరిగి వెళ్లి చూడగా బాలింతతో పాటు ఆమె చంటిబిడ్డా ఆ ప్రాంతంలో ఎక్కడా కనిపించలేదు. మరుసటి రోజు బాలింత, పసికందు బావిలో శవమై కనిపించారు. ఈ కేసు ఊహించని మలుపు తిరిగింది.

 ఏడాది క్రితం పెళ్లి

ఏడాది క్రితం పెళ్లి

తమిళనాడులోని విల్లుపురం జిల్లా సెంచి సమీపంలోని మేలెడియాలం పంచాయతీ పరిధిలోని కడ్కల్‌తోపు గ్రామానికి చెందిన లాలూబాషా దంపతులకు ఫిర్దోస్ (21) అనే కుమార్తె ఉంది, తమిలనాడులోని తిరువణ్ణామలై జిల్లా కిలిపెన్నత్తూరు సమీపంలోని ఆవుర్ గ్రామానికి చెందిన అన్వనార్ పాషా అబ్దుల్లా అనే కుమారుడు ఉన్నాడు. అబ్దుల్లా, ఫిర్దోస్ కు పెళ్లి చెయ్యాలని పెద్దలు మాట్లాడుకున్నారు. గత ఏడాది ఫిబ్రవరి నెలలో అబ్దుల్లా, ఫిర్దోస్ ల వివాహం జరిగింది.

 కాన్ఫు కోసం పుట్టింటికి వెళ్లిన మహిళ

కాన్ఫు కోసం పుట్టింటికి వెళ్లిన మహిళ


వివాహం చేసుకున్న ఫిర్దోస్ ఆమె భర్త అబ్దుల్లాతో కాపురం చేసి గర్బవతి అయ్యింది. మొదటి కాన్ఫు కావడంతో ఫిర్దోస్ డెలవరీ కోసం విల్లుపురం జిల్లాలోని ఆమె పుట్టింటికి వెళ్లింది. 50 రోజుల క్రితం ఫిర్దోస్ ఆడబిడ్డకు జన్మనిశ్చింది. బాలింత ఫిర్దోస్ ఆమె బిడ్డతో కలిసి పుట్టింటిలోనే ఉంది. ప్రతిరోజు ఫిర్దోస్ కు ఆమె తల్లి సేవలు చేస్తోంది. భర్త అబ్దుల్లా వచ్చి తనను తన ఇంటికి పిలుచుకుని వెలుతాడని ఫిర్దోస్ నెల రోజుల నుంచి ఆశగా ఎదురు చూస్తోందని తెలిసింది.

 బావిలో శవమైన పసికందు

బావిలో శవమైన పసికందు

ఉదయం ఫిర్దోస్ తల్లిదండ్రులు పని మీద వేరే గ్రామానికి వెళ్లారు. ఆ సమయంలో చంటి బిడ్డతో కలిసి ఫిర్దోస్ ఇంటిలోనే ఉంది. సాయంత్రం ఇంటికి వెళ్లిన కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు, ఫిర్దోస్ తో పాటు చంటి బిడ్డకనపడకపోవడంతో చుట్టుపక్కల గాలించారు. భర్త అబ్దుల్లాకు ఫోన్ చేసి అడిగితే ఎక్కడికి వెళ్లిందో మాకు ఏం తెలుసు అని సమాధానం ఇచ్చాడు.

 కూతుర్ని హత్య చేసి తల్లి ఆత్మహత్య

కూతుర్ని హత్య చేసి తల్లి ఆత్మహత్య

మరుసటి రోజు ఉదయం ఊరి బయట ఉన్న వ్యవసాయ బావిలో 50 రోజుల వయసున్న పసికందు తేలడాన్ని చూసిన గ్రామస్తులు హడలిపోయి ఫిర్దోస్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అయితే పిర్దోస్ ఎక్కడా కనిపించకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బావిలో గాలించి ఫిర్దోస్ మృతదేహాన్ని బయటకు తీశారు. డీఎస్పీ ప్రియదర్శిని నేతృత్వంలో పోలీసులు విచారణ చేశారు.

 భర్త విలన్

భర్త విలన్

మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం ముండియంబాక్కం ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే మ్యాటర్ బయటకు వచ్చింది. అడిగిన కట్నం తీసుకు వచ్చే వరకు నా ఇంటిలోకి నిన్ను అడుగుపెట్టనివ్వనని అబ్దుల్లా అతని భార్య ఫిర్దోస్ కు తేల్చి చెప్పాడని బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు, భర్త టార్చర్ తట్టుకోలేక ఫిర్దోస్ చంటి బిడ్డను బావిలో తోసి ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+