మంత్రి చెప్పారు, మీకు రూ. కోట్లు వచ్చే కార్పోరేషన్ పదవి గ్యారెంటీ, గీతా మేడమ్ దెబ్బతో !
బెంగళూరు/బళ్లారి: కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే సన్నిహితుడు అని చెప్పకుంటూ కాంగ్రెస్ నేతలను పిలిపించి కార్పొరేషన్ బోర్డుల చైర్మన్ పదవి ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేసేందుకు యత్నించిన ఓ యువకుడిని బెంగళూరులోని సదాశివనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.మైసూరు రామకృష్ణా నగర్‌కు చెందిన రఘునాథ్ అనే యువకుడిని అరెస్టు చేసి నిందితుడి నుంచి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఇటీవల కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గేకి తాను చాలా సన్నిహితుడిు అంటూ బెంగళూరులోని దాసరహళ్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకురాలు గీతా శివరామ్‌కు రఘునాథ్ ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని గీత వెంటనే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మంత్రి ప్రియాంక ఖార్గే పరిశీలించగా అది గుర్తు తెలియని వ్యక్తు చేసిన పని తేలింది.

మంత్రి ప్రియాంక ఖర్గే సన్నిహితుడు కేశవమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు విచారణ జరిపి నిందితుడిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మైసూరుకు చెందిన రఘునాథ్ తుమకూరులోని సప్తగిరి బరంగేలో స్థిరపడ్డాడు. రఘునాథ్ వృత్తిరీత్యా నేరస్తుడని, అతనిపై విధానసౌధ పోలీస్ స్టేషన్‌లో గతంలోనే చీటింగ్ కేసు కూడా నమోదు అయ్యిందని పోలీసులు అన్నారు.
ప్రభుత్వ స్థాయిలో నామినేటెడ్ పదవులు ఇప్పిస్తానని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రజలను నమ్మించి మోసం చేసి సొమ్ము చేసుకోవడమే రఘునాథ్ పనిగా పెట్టుకున్నాడని పోలీసులు తెలిపారు. అదేవిధంగా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత రఘునాథ్ మంత్రి ప్రియాంక ఖార్గే ప్రైవేట్ సెక్రటరీ కేశవమూర్తి పేరుతో కొందరు కాంగ్రెస్ నేతలకు ఫోన్ చేసి కార్పొరేషన్ బోర్డుల చైర్మన్ పదవి ఇప్పిస్తానని నమ్మించాడు.

ఇందుకోసం భారీ మొత్తంలో డబ్బులు చెల్లించాలని రఘునాథ్ డిమాండ్ చేశాడు. అదేవిధంగా మే 20న దాసరహళ్లి కాంగ్రెస్ నాయకురాలు గీతకు ఫోన్ చేసిన నిందితుడు మంత్రి ప్రియాంక ఖార్గే మిమ్మల్ని కార్పొరేషన్ బోర్డుకు చైర్మన్ చెయ్యాలని అనుకుంటున్నారని, మీకు మంచి చాన్స్ చిక్కిందని, ఆ చాన్స్ సద్వినియోగం చేసుకోవాలని చెప్పాడు.
ఈ పని చేయాలంటే డబ్బులు చెల్లించాల్సిందేనన్నారు. ఈ కాల్‌పై అనుమానం వచ్చిన గీత వెంటనే మంత్రి ప్రియాంక ఖార్గేకి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న మంత్రి ప్రియాంక ఖార్గే పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. కాంగ్రెస్ నాయకురాలు గీతాకు వచ్చిన మొబైల్ కాల్ నంబర్‌ను పరిశీలించగా మోసగాడు రఘనాథ్ వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది.












Click it and Unblock the Notifications