నిన్న ప్రజ్వల్, నేడు సోదరుడు, స్వలింగ సంపర్కుల కేసు, అంత పెద్ద ఫ్యామిలీలో?
కర్ణాటకలోని హాసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై అత్యాచారం కేసు నమోదు కావడం దేశ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు, ఎమ్మెల్సీ డాక్టర్ సూరజ్ రేవణ్ణపై స్వలింగ లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. మాజీ మంత్రి హెచ్‌డీ. రేవణ్ణ పెద్ద కుమారుడు సొంత పార్టీకి చెందిన ఓ యువకుడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ తీవ్ర ఆరోపణ వినిపిస్తోంది.ఈ చర్య జూన్ 16వ తేదీన జరిగినట్లు సమాచారం.
చిన్న కొడుకు ప్రజ్చల్‌పై అత్యాచారం ఆరోపణల నేపథ్యంలో మరో కొడుకుపై స్వలింగ లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. హాసన్ జిల్లా అరకలగూడకు చెందిన జేడీఎస్ కార్యకర్త ఒకరు ఎమ్మెల్సీ డాక్టర్ సూరజ్ తనపై స్వలింగ సంపర్కుడిలా లైంగిక దాడి చేశాడని ఆరోపించారు. ఎమ్మెల్సీ డాక్టర్ సూరజ్ మీద స్వలింగ సంపర్కుడు అని ఆరోపణలు రావడం, తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ యువకుడు ఆరోపించడం కలకలం రేపింది.

డాక్టర్ సూరజ్ రేవణ్ణ తన మీద లైంగిక దాడి చెయ్యడమే కాకుండా తనను దుర్భాషలాడాడని బాధితుడు కర్ణాటక డీజీపీ, ఐజీలకు ఫిర్యాదు చేశాడు. బలవంతంగా తన మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడని ఫిర్యాదు చేశాడు.
జూన్ 16వ తేదీ రాత్రి చెన్నరాయపట్నం తాలూకాలోని గన్నికాడ ఫామ్‌హౌస్‌లో సూరజ్ రేవణ్ణ తన మీద లైంగిక దాడి చెయ్యడానికి ప్రయత్నించాడని ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ వింత ఆరోపణలతో రేవణ్ణ కుటుంబం మళ్లీ కంగుతిన్నది. ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ యువకుడు ఆరోపించాడు. ఆ యువకుడు కర్ణాటక సీఎం, హోంమంత్రి, డీజీ, ఐజీపీ, హాసన్ ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ ఉదంతం హాసన్ జిల్లాలో జోరుగా చర్చనీయాంశమైంది. ఈ విషయమై బాధితుడు బెంగళూరు వెళ్లి ఫిర్యాదు చేశాడు.
బాధిత యువకుడిపై ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సూరజ్ సహాయకుడు శివకుమార్ హలేనరసిపుర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తప్పుడు ఆరోపణలు చేసి ఎమ్మెల్సీ సూరజ్ ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఆరోపిస్తూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్నారని, రూ. 5 కోట్లు ఇవ్వాలని సూరజ్ రేవణ్ణను బెదిరించారని ఆయన పీఏ కేసు పెట్టారు.
రూ. 5 కోట్లు డబ్బులు చెల్లించకుంటే స్వలింగ లైంగిక వేధింపుల కేసు నమోదు చేస్తామని నిందితుడు బ్లాక్ మెయిల్ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అరకలగూడకు చెందిన ఓ యువకుడు తన యజమాని వద్ద ఉద్యోగం ఇప్పించాలని సూరజ్ పీఏ శివకుమార్‌కు ఫోన్ చేశాడు. దీంతో జూన్ 16వ తేదీన సూరజ రేవణ్ణ ఉద్యోగం కోసం గన్నికాడ ఫాంహౌస్‌కు వెళ్లాడు. పని అడిగేసరికి తిరిగి వచ్చిన సూరజ్‌ను బ్లాక్‌మెయిల్ చేశాడని కేసు నమోదు అయ్యింది.












Click it and Unblock the Notifications