తెల్ల పులి పిల్లలు: పేర్లు పెట్టిన జయలలిత (ఫోటోలు)
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత నాలుగు తెల్ల పులి పిల్లలకు నామకరణం చేశారు. చూడముచ్చటగా ఉన్న నాలుగు తెల్ల పులి పిల్లలకు చక్కటి పేర్లు పెట్టి వార్తల్లో నిలిచారు. మంత్రులు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.
చెన్నైలోని వండలూరు లోని ప్రసిద్ది చెందిన అరిగ్నార్ అన్నా జూపార్క్ లో నమృత అనే తెల్లపులి ఉంది. ఈ తెల్ల పులి ఇటీవల నాలుగు తెల్ల పులి పిల్లలకు జన్మనిచ్చింది. జూపార్క్ అధికారులు ముఖ్యమంత్రి జయలలిత దగ్గర పులి పిల్లలకు నామకరం చేయించాలని నిర్ణయించారు.

విషయం అమ్మకు చెప్పారు. అరుదుగా ఉండే తెల్ల పులి పిల్లలకు నామకరణం చెయ్యడానికి జయలలిత ఆసక్తి చూపించారు. ఆదివారం ముఖ్యమంత్రి జయలలిత, మంత్రులు, అధికారులు అరిగ్నార్ అన్నా జూపార్క్ చేరుకున్నారు.

నాలుగు తెల్లపులి పిల్లల్లో రెండు మగ, రెండు ఆడ ఉన్నాయి. ఆడ పులిపిల్లలకు మాలా, కాలా అని పేర్లు పెట్టారు. రెండు మగ పులి పిల్లలకు దేవా, నకులా అని పేర్లు పెట్టారు. జూపార్క్ లో పులి పిల్లలను చూస్తూ అమ్మ ఉల్లాసంగా గడిపారు.












Click it and Unblock the Notifications