Health: మీరు ఆ కంపెనీ మసాలాలు వాడుతున్నారా.. అయితే క్యాన్సరే..!
హాంకాంగ్ ఆహార నియంత్రణ ప్రాధికార సంస్థ సెంటర్ ఫుడ్ సేఫ్టీ మరో బాంబు పేల్చింది. మనం తీసుకుంటున్న ఆహార పదార్థాలపై సంచలన విషయాలు బయట పెట్టింది. కొద్ది రోజుల క్రితం నెస్లే బేబీ ఫుడ్ ప్రొడక్ట్ లో షుగర్ ఎక్కువగా ఉందని వార్తలు వచ్చాయి. తాజాగా దేశంలో ప్రసిద్ధి చెందిన మసాలా ఉత్పత్తుల తయారి సంస్థలపై హాంకాంగ్ ఆహార నియంత్రణ ప్రాధికార సంస్థ సెంటర్ ఫుడ్ సెఫ్టీ షాకింగ్ వివరాలను బయటపెట్టింది.
ఎవరెస్ట్, ఎండీహెచ్ నాలుగు ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు సెంటర్ ఫుడ్ సేఫ్టీ తెలిపింది. ఎండీహెచ్, ఎవరెస్ట్ కంపెనీలకు చెందిన నాలుగు రకాల ఉత్పత్తుల నమూనాలకు సెంటర్ ఫుడ్ సెఫ్టీ సాధారణ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో ఈ నాలుగు ఉత్పత్తుల్లో ఇథలీన్ ఆక్సైడ్ ఉందని తేలినట్లు చెప్పింది. దీన్ని పురుగుమందుల్లో వాడే రసాయనంగా పేర్కొంది. నాలుగు మసాలాల్లో ఎవరెస్ట్ కంపెనీకి చెందిన ఫిష్ కర్రీ మసాలా ఉంది.

మిగిలిన మూడు మసాలాలు ఎండీహెచ్ కంపెనీకి చెందినగా పేర్కొంది. ఈ మూడు మసాలాల్లో మద్రాస్ కర్రీ పౌడర్ (స్పైస్ బ్లెండ్ ఫర్ మద్రాస్ కర్రీ), మిక్స్‌డ్ మసాలా పౌడర్, సాంబార్ మసాలా ఉన్నట్లు వెల్లడించింది. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రిసెర్చ్ ఆన్ క్యాన్సర్ సంస్థ గ్రూప్ 1 క్యాన్సర్ కారకంగా ఇథిలీన్ ఆక్సైడ్‌ను గుర్తించినట్లు తెలిపింది. దీంతో ఈ నాలుగు ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేయాలని స్పష్టం చేసింది.
ఇథలీన్ ఆక్సైడ్ వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని హాంకాంగ్ సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ తెలిపింది. ఇండియా నుంచి దిగుమతి చేసుకున్న ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలను సింగపూర్ తన మార్కెట్ల వెంటనే తొలగించాలని స్పష్టం చేసింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications