సజీవ అవయవాలు: మైసూరు టూ బెంగళూరు

బెంగళూరు: బ్రెయిన్ డెడ్ అయిన మహిళ సజీవ అవయవాలు సేకరించి వేరే నగరానికి తరలించి మరి కొందరి ప్రాణాలు నిలబెట్టారు. బుధవారం మైసూరు నగరం నుంచి బెంగళూరు నగరంలోని ఆసుపత్రికి సజీవంగా ఉన్న అవయవాలు తీసుకు వచ్చారు.

మైసూరు నగరంలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు బ్రెయిన్ డెడ్ అయ్యింది. ఆమె అవయవాలు దానం చెయ్యడానికి కుటుంబ సభ్యులు అంగీకరించారు. బుధవారం ఆ మహిళ అవయవాలు సేకరించారు.

There is an attempt making to transport LIVE ORGANS of a brain dead woman case.

మధ్యాహ్నం 2.40 గంటల సమయంలో ప్రత్యేక అంబులెన్స్ లో అవయవాలు తీసుకుని బెంగళూరు బయలుదేరారు. మద్యాహ్నాం 4.10 నిమిషాలకు అంబులెన్స్ బెంగళూరు నగర శివార్లలోని కంగేరి దగ్గర ఉన్న నైస్ రోడ్డు దగ్గరకు చేరుకుంది.

తరువాత బెంగళూరు నగర ట్రాఫిక్ పోలీసుల సహకారంతో ఫ్రీసిగ్నల్ గ్రీన్ కారిడార్ తో అంబులెన్స్ ను గొట్టిగెరె, హుళిమావు గేట్, అరకెరె గేట్ మార్గంలో బన్నేరుఘట్ట రోడ్డులోని అపోలో ఆసుపత్రి చేరుకున్నారు. కొందరి ప్రాణాలు కాపాడటానికి ట్రాఫిక్ పోలీసులు పూర్తిగా సహకరించారని వైద్యులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+