సీమాంధ్రది న్యాయం: శరద్ యాదవ్, ఫిక్సింగని బాబు

సమైక్య ఉద్యమాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు. సీమాంధ్ర ఉద్యమంలో న్యాయముందని చెప్పారు. విభజన సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రం పైనే ఉందన్నారు. తాము మూడో ఫ్రంట్ పైన చర్చించలేదని చెప్పారు.
మ్యాచ్ ఫిక్సింగ్ అర్థమైంది: బాబు
ఢిల్లీ పెద్దలను కలిసేందుకు వచ్చిన కాంగ్రెసు పార్టీ ఎంపీలు, మంత్రుల కుటుంబ సభ్యులతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల కుటుంబ సభ్యులు కూడా వచ్చారని, దీంతోనే ఆ రెండు పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగును అర్థం చేసుకోవచ్చునని చంద్రబాబు నాయుడు అన్నారు.
సమస్యను సృష్టించిన కాంగ్రెసు పార్టీయే పరిష్కారం చూపాలన్నారు. తాను ఆ పార్టీని కలవనని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి విలీనం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో కలిసి పోయేందుకే కాంగ్రెసు పార్టీ ఇలాంటి రాజకీయాలు చేస్తోందన్నారు. వారి రాజకీయాల కోసం నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. ప్రజల జీవితాలతో ఆడుకునే వారు బాగుపడిన సందర్భాలు లేవన్నారు. తాను ఢిల్లీలో ఎవరితోను రాజకీయాలు మాట్లాడటం లేదని చెప్పారు. కాగా, శనివారం కాంగ్రెసు నేతల సతీమణులు ఢిల్లీ పెద్దలను కలిసినప్పుడు వారితో పాటు జగన్ పార్టీ నేతల సతీమణులు పలువురు ఉన్నారు.












Click it and Unblock the Notifications