డాన్ అంటే డానే: భార్యతో ఎంజాయ్ చేస్తున్న అబూసలేం(ఫొటోలు)

Subscribe to Oneindia Telugu

ముంబై: తాము ఎక్కడున్నా తమకు అందే సౌకర్యాలు అందుతూనే ఉంటాయని మరోసారి నిరూపించాడు మాఫియా డాన్‌ అబూసలేం. కొన్నిసార్లు జైళ్లే వారికి ఫైవ్‌స్టార్ హోటళ్లలా మారిపోతే, మరొకొన్నిసార్లు పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుంటారు. సరిగ్గా అలాగే చేస్తున్నాడు విచారణలో ఉన్న గ్యాంగ్‌స్టర్ అబూ సలేం.

తరచూ విచారణల కోసం లక్నో, ఢిల్లీ వెళ్లేటప్పుడు మధ్యలో రైల్వేస్టేషన్లలోని వెయిటింగ్ రూముల్లో తన భార్యను కలిసి ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన కొన్ని అరుదైన ఫొటోలను 'మిడ్ డే' పత్రిక తాజాగా ప్రచురించింది.

అబూసలేం తన భార్య సయ్యద్ బహార్ కౌసర్(26)తోపాటు పలువురు కుటుంబ సభ్యులను కూడా వెయిటింగ్ రూముల్లో కలుసుకొన్నట్టు ఈ ఫొటోల ద్వారా తెలుస్తోంది. ఇక్కడే సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ కూడా కనిపించాడు.

These Pictures Prove Abu Salem's Enjoying Life With Wife

ప్రస్తుతం తలోజా జైలులో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న అబూ సలేంను విచారణ కోసం వేర్వేరు నగరాలకు పోలీసులు తీసుకెళ్తుంటారు. దీన్నే సలేం తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. రైల్వేస్టేషన్ వెయిటింగ్ రూముల్లో భార్య, ఇతర కుటుంబసభ్యులను కలుసుకుంటున్న విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

అబూసలేంను పెళ్లి చేసుకుంటానని, ఇందుకు అనుమతి ఇవ్వాలని కౌసర్ గత జూన్‌లో కోర్టును కోరారు. మధ్యలో ఓసారి పెళ్లి చేసుకోవడం వల్ల తన జీవితం నాశనం అయ్యిందని మీడియా ఎదుట ఘొల్లుమన్నారు.

These Pictures Prove Abu Salem's Enjoying Life With Wife

కానీ, తాజా ఫొటోలు చూస్తే మాత్రం ఇద్దరూ కలిసి ఎంజయ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. వీళ్లిద్దరి వివాహం కదులుతున్న రైలులో బంధువులు, ఎస్కార్ట్ పోలీసుల సమక్షంలో జరిగినట్టు, వాళ్లే అబూసలేంకు సెల్‌ఫోన్ ఇచ్చినట్టు వార్తలు, కథనాలు మీడియాలో ప్రాధాన్యాంశంగా మారాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A set of exclusive photographs in mid-day's possession show how under-trial gangster Abu Salem has been meeting the woman he has sought court permission to marry on train journeys to Lucknow and Delhi for various trials.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి