మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన ఇద్దరు ఎంపీలు: ఎవరంటే?

న్యూఢిల్లీ: సుదీర్ఘ కాలం ఎదురుచూపులకు స్వస్తి పలుకుతూ బుధవారం లోక్‌సభలో మహిళారిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించిన విషయంతెలిసిందే. బిల్లుకు మద్దతుగా 454 మంది సభ్యులు ఓటు వేశారు. అయితే, ఈ బిల్లును ఇద్దరుఎంపీలు మాత్రం వ్యతిరేకించారు. లోక్‌సభలో మొత్తం 545 మంది ఎంపీలకు గానూ456 మంది సభకు హాజరై ఓటు వేశారు.

కాగా,మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన ఇద్దరు ఎంపీలు కూడా హైదరాబాద్ కేంద్రంగానడిచే ఎంఐఎం సభ్యులే కావడం గమనార్హం. ఇందులో ఒకరు ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కాగా, మరొకరు ఛత్రపతి శంభాజీనగర్(ఔరంగాబాద్) ఎంపీ ఇంతియాజ్ జలీల్. అంతకుముందు, చర్చలో భాగంగా ఓబీసీ,ముస్లిం మహిళ వ్యతిరేక బిల్లుగా ఒవైసీ విమర్శించారు.

womens reservation bill in lok sabha

ఈ బిల్లు కేవలం అగ్రకుల మహిళల కోసమే ప్రవేశపెట్టిన బిల్లుగా అభివర్ణించారు. ఓబీసీ మహిళలకు మహిళా కోటాలో రిజర్వేషన్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఎంఐఎం ఈ బిల్లును వ్యతిరేకిస్తుందని చెప్పారు. మహిళా బిల్లును చెక్ బౌన్స్ బిల్లు.. ఓబీసీ, ముస్లిం మహిళ వ్యతిరేక బిల్లుగా విమర్శించారు. కేంద్రం సవర్ణ/అగ్రకుల మహిళల ప్రాతినిథ్యం పెంచాలని చూస్తోందని ఆరోపించారు.

లోక్‌సభలో చారిత్రక ఘట్టం

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లు(women's reservation bill)కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. నారీ శక్తి అధినియమ్ పేరుతో ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

బుధవారం ఈ బిల్లుపై దాదాపు 8 గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం బుధవారం రాత్రి న్యాయశాఖ మంత్రి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 454 మంది ఎంపీలు అనుకూలంగా.. ఇద్దరు వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో చారిత్రక మహిళా బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినట్లయింది.

మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాన్యువల్ పద్ధతిలోనే ఓటింగ్ జరిగింది. ఎరుపు, ఆకుపచ్చ స్లిప్పులను లోక్‌సభలో సభ్యులందరికీ అందజేశారు. అనంతరం ఓటింగ్ జరిగే ప్రక్రియపై లోక్‌సభ సెక్రటరీ జనరల్ సభ్యులకు వివరించారు. బిల్లుకు మద్దతు తెలిపినట్లయితే.. 'ఎస్' అని ఆకుపచ్చ స్లిప్పుపై రాయాలని.. వ్యతిరేకిస్తే ఎరుపు స్లిప్పుపై 'నో' అని రాయాలని చెప్పారు.

ఆ తర్వాత ఓటింగ్ జరిగింది. రాజ్యాంగ సవరణ కూడా ఉండటంతో మాన్యువల్ పద్ధతిలో ఓటింగ్ చేపట్టారు. ఓటింగ్‌కు కొద్ది సేపటి ముందే ప్రధాని నరేంద్ర మోడీ సభలోకి వచ్చారు. ఆయన వచ్చని తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఓటింగ్ జరిగింది. దాదాపు సభలోనే అత్యధిక మంది సభ్యుల మద్దతుతో బిల్లుకు ఆమోదం లభించింది. అయితే, మహిళా రిజర్వేషన్లు మాత్రం వచ్చే సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత నుంచే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+