త‌మిళ‌నాడులోని ఈ ఊళ్లు.. 22 ఏళ్ల నుంచి బాణాసంచాకు దూరం...

దీపావ‌ళి అన‌గానే ట‌పాసులు గుర్తుకొస్తాయి. మ‌తాబులు కాల్చ‌క‌పోతే అది పండ‌గే కాద‌ని చాలామంది భావిస్తారు. అందుకే ఎంత‌టి వారైనా స‌రే దీపావ‌ళి నాడు చిన్న‌చిన్న‌చిచ్చుబుడ్డుల‌నైనా కాలుస్తారు. కానీ, త‌మిళ‌నాడులోని కొన్నిగ్రామాల్లో మాత్రం దీపావ‌ళి పండుగ ఎంతో నిశ్శ‌బ్దంగా జ‌రిగింది. అక్క‌డ ఎలాంటి బాణాసంచా జ‌ర‌గ‌లేదు. ఆ ప్రాంతాల్లో కేవ‌లం దీపాల‌ను వెలిగించి మాత్ర‌మే పండుగ‌ను జ‌రుపుకున్నారు. ఈ రాష్ట్రంలోని మొత్తం ఏడు గ్రామాలు ఇదే ప‌ద్ధ‌తిని అనుస‌రించాయి.

ఏడు గ్రామాలు బాణాసంచాకు దూరం : త‌మిళ‌నాడులోని ఈ రోడ్ జిల్లాలోని ఏడు గ్రామాల్లోని ప్ర‌జ‌లు కేవ‌లం దీపాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యారు. అయితే, ఇందుకు ఒక బ‌ల‌మైన కారణం ఉన్న‌ట్లు తెలుస్తుంది. కూంద‌న్‌కుళం.. త‌మిళనాడులోని తిరునెల్వేలీ జిల్లాలోని ఓ చిన్న గ్రామం. ఈ గ్రామంతో పాటు మ‌రో ఆరు గ్రామాలు 22 ఏళ్ల‌నుంచి బాణ‌సంచాకు దూరంగా ఉన్నాయి. ఈ గ్రామాల‌కు స‌మీపంలో ర‌క‌ర‌కాల ప‌క్షుల‌తో నిండిన ఓ అభ‌యార‌ణ్యం ఉంది. ఈ కార‌ణంగానే ఈ ప్రాంతాల వారు ఎన్నో యేళ్ల నుంచి ట‌పాసుల‌కి దూరంగా ఉన్నారు. దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా ఇక్క‌డ బాణ‌సంచా కాల్చినా, ట‌పాసులు పేల్చినా స‌రే, ఆ శ‌బ్బానికి ఈ అభ‌యార‌ణ్యంలో ఉండే ప‌క్షులు భ‌య‌ప‌డ‌తాయ‌నీ, బాణ‌సంచా నుంచి వ‌చ్చే పొగ చెట్ల‌మీద ఉన్న గూళ్ల‌కు హాని క‌లిగిస్తుంద‌ని ఇక్క‌డివారు ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌..

These villages in Tamil Nadu... have been away from fireworks since 22 years...

ప‌క్షుల‌కు హానీ త‌ల‌పెట్ట‌కుండా ఉండేందుకు ఈ నిర్ణ‌యం : ఈ అభ‌యార‌ణ్యం ఈ రోడ్ జిల్లా నుంచి సుమారు ప‌ది కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. కూంద‌న్‌కుళం గ్రామంతో పాటు సెల్లప్పంపాళయం, వడముగమ్‌ వెల్లోడ్‌, సెమ్మందంపాళయం, కరుక్కనకట్టు వాలాసు, పుంగంపాడి వంటి గ్రామాలున్నాయి. ఈ అభయార‌ణ్యానికి అక్టోబ‌ర్ నుంచి జ‌న‌వ‌రికి దేశ‌విదేశాల‌నుంచి ప‌క్షులు వ‌ల‌స వ‌స్తాయి. ఇక్క‌డ వేలాది ప‌క్షులు గుడ్లుపెట్టి, పిల్ల‌ల‌ను పొదుగుతుంటాయి. ఈ ప‌క్షులకు హానీ క‌లుగుతుంద‌ని, ఈ గ్రామాల వారు లౌడ్ స్పీక‌ర్ల‌ను కూడా వాడ‌డం ఆపేసారు.

వీటికి అనువైన వాతావ‌ర‌ణం క‌ల్పించేందుకు ఇక్క‌డి తొమ్మిది వంద‌లకు పైగా కుటుంబాలు బాణ‌సంచా కాల్చొద్ద‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా ఇక్క‌డివారంతా కొత్త‌బ‌ట్టలు ధ‌రించి, దీపాలు వెలిగించి పండుగ‌ను జ‌రుప‌కుంటారు. ఇక్క‌డి పిల్ల‌లు ట‌పాసులు కాలుస్తామ‌ని అడిగిన ప్ర‌తిసారి వాటిని కాల్చ‌డం వ‌ల్ల జ‌రిగే న‌ష్టం గురించి వారికి వివ‌రించేవారు. దాంతో పిల్ల‌లు కూడా అర్థం చేసుకుని ట‌పాసుల నుంచి దూరంగా ఉండేవారు.

అయితే, ఈ సంవ‌త్స‌రం కూడా ఇక్క‌డ దీపావ‌ళి వేడుకలు ఎంతో నిశ్శ‌బ్దంగా జ‌రిగాయ‌ని ఓ జాతీయ మీడియా ప్ర‌క‌టించింది. ఈ ప్రాంతాల్లో దీపావ‌ళి రోజును ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు తావులేద‌ని పేర్కొన్నాయి. అలాగే ఇక్క‌డంతా ప‌క్షుల కిల‌కిల‌రావాలు మాత్ర‌మే వినిపించాయ‌ని పేర్కొంది. అయితే, ప‌క్షుల ప‌ట్ల వీరికున్న ప్రేమ‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+