భారత్ లో థర్డ్ వేవ్ భయం; పెరుగుతున్న మరణాలు; రికవరీల కంటే ఎక్కువగా కొత్త కేసులు !!
భారతదేశంలోకరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కాస్త హెచ్చు తగ్గులతో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. భారతదేశంలో కరోనా మహమ్మారి కేసుల ఊగిసలాట ఆందోళన కలిగిస్తుంది. తగ్గినట్టే కనిపిస్తున్న కేసులు మరోమారు క్రమక్రమంగా పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఇదే సమయంలో మరణాల సంఖ్య పెరగడం కూడా భారతదేశానికి పెద్ద తలనొప్పిగా తయారైంది. ప్రస్తుతం భారత్ లో మరణాలు పెద్ద సంఖ్యలో నమోదు కావడం, కోరుకున్న వారి కంటే కొత్త కేసులు ఎక్కువగా ఉండటం కరోనా థర్డ్ వేవ్ పొంచి ఉందా అన్న అనుమానాలకు కారణంగా మారింది.

రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువ
కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం, గత 24 గంటల్లో భారతదేశంలో 14,348 కొత్త కరోనా కేసులు నమోదు కాగా 805 కరోనా మరణాలు సంభవించాయి. యాక్టివ్ కేసులు 1,61,334 గా ఉన్నాయి. భారతదేశం గత 24 గంటల్లో 13,198 రికవరీలను నివేదించింది. రికవరీ రేటు 98.19 శాతంగా ఉంది. ఇది మార్చి 2020 తర్వాత అత్యధికం. యాక్టివ్ కేసులు మొత్తం కేసుల్లో 1 శాతం కంటే తక్కువగా ఉన్నాయి, ప్రస్తుతం ఇది 0.47 శాతంగా ఉంది, ఇది మార్చి 2020 తర్వాత అతి తక్కువ. రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా నమోదు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది.

దేశ వ్యాప్తంగా నవంబర్ 30 వరకు కరోనా ప్రోటోకాల్స్
కొన్ని రాష్ట్రాలు, యుటిలలో కరోనావైరస్ వ్యాప్తి నివేదికలతో, మహమ్మారి మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా కోవిడ్ -19 నియంత్రణ చర్యలను నవంబర్ 30 వరకు పొడిగించింది. కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి ఇప్పటికే ఉన్న ప్రోటోకాల్‌లు నవంబర్ 30 వరకు కొనసాగుతాయని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా తెలిపారు. పశ్చిమ బెంగాల్, అస్సాం మరియు హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు తాజాగా కేసులు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దసరా, దీపావళి పండుగ తర్వాత కరోనా మహమ్మారి మరింత విజృంభించే అవకాశాలున్నాయని అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం పదే పదే సూచిస్తుంది.

పశ్చిమ బెంగాల్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్ లలో దసరా తర్వాత పెరిగిన కేసులు
పశ్చిమ బెంగాల్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో దుర్గాపూజ తర్వాత వారంలో కొత్త కేసులు 40% వరకు పెరిగాయి. కొత్త డెల్టా 'సబ్ వేరియంట్' ఆవిర్భావం కూడా ముప్పును కలిగిస్తోంది. కొత్త డెల్టా సబ్ వేరియంట్ ఏ వై 4.2 ఇప్పుడు భారతదేశంలో ఆందోళనకర పరిస్థితులకు కారణమవుతుంది. ఈ వైరస్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారికి సైతం వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకూ ఉప వంశ మైన ఏ వై 4.2 వేరియంట్ నమోదైన మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ,కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేస్తుంది.

కరోనాతో ప్రపంచ పోరాటం కొనసాగుతూనే ఉంది
భారతదేశంలో గత 34 రోజులుగా 30,000 కొత్త కోవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రికవరీ రేటు మెరుగు పడినప్పటికీ, మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. గత వారం, కోవిడ్-19 వ్యాక్సినేషన్‌లో భారతదేశం 100 కోట్ల మైలురాయిని దాటింది. భారతదేశంలో మొత్తం కోవిడ్-19 పరిస్థితి అదుపులో ఉంది. కోవిడ్-19 మహమ్మారిపై పోరాటం ఇంకా ముగియలేదు. దాదాపు రెండేళ్ల తర్వాత కూడా, ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ ముప్పును కొనసాగిస్తోంది. అమెరికా, చైనా, రష్యా వంటి దేశాలు ఇప్పటికీ కరోనా కొత్త వేవ్ లతో పోరాడుతున్నాయి. సుమారు ఆరు మిలియన్ల జనాభా ఉన్న నగరంపై కూడా చైనా లాక్‌డౌన్ విధించింది.












Click it and Unblock the Notifications