• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆదుకోండి: ఐసీయూలో చిట్టితండ్రి.. మీ ఆపన్నహస్తం ఓ ప్రాణాన్ని నిలబెడుతుంది

|

నా కుమారుడు కృష్ణ జులై 29, 2017న జన్మించాడు. పుట్టిన నాటి నుంచి తను చాలా కొంటెగా ఉండేవాడు. అందుకే వాడి తల్లి, నేను కలిసి వాడికి భగవాన్ కృష్ణ పేరు పెట్టాలనుకుని నిర్ణయించుకున్నాం. ఈరోజు నా చిట్టితండ్రి ఐసీయూలో గుండె సంబంధిత వ్యాధికి చికిత్స పొందుతున్నాడు.

గుండెకు సంబంధించిన నరాల్లో సమస్య తలెత్తినట్టు డాక్టర్లు చెప్పారు. వాడి సున్నితమైన శరీరంలో మలినాలతో కూడిన రక్తం నరాల్లోకి వచ్చి చేరడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైనట్టు తెలిపారు. వీలైనంత త్వరగా కృష్ణకు సర్జరీ చేయించకపోతే వాడిని మేము కోల్పోతాము. ఆ బాధతో గత కొద్ది రోజుల నుంచి కంటి మీద కునుకు కరువైంది. తిండి తినడం సంగతి పక్కనపెడితే.. ఆఖరికి శ్వాస తీసుకోవడం కూడా భారంగా మారింది. నేనిప్పుడు చాలా భయాందోళనలో ఉన్నాను.

నా పేరు సోమ్ నాథ్ పవార్. భార్య, తల్లిదండ్రులు, సోదరుడు, అతని భార్య, చెల్లెలు, ఆమె ఇద్దరు కూతుళ్లు అంతా కలిసి ఇప్పటికీ ఉమ్మడిగానే ఉంటున్నాం. రైతుగా జీవనం సాగిస్తున్న నేను రోజుకు రూ.100 సంపాదిస్తున్నాను. నాకున్న భూమే నాకు అంతో ఇంతో ఆదాయం ఇస్తున్న ఏకైక మార్గం. కుటుంబంలోని ఎనిమిది మందికి అదే తిండి పెడుతోంది.

కృష్ణ కు ఆపరేషన్ చేయించడానికి తక్షణం ఇప్పుడు రూ.8లక్షలు కావాల్సి వచ్చింది. సకాలంలో నాకు ఆర్థిక మద్దతు అందకపోతే నేను నాకున్న భూమిని అమ్ముకోవాల్సి వస్తుంది. అది అమ్మినా నాకు వచ్చేది కేవలం రూ.1లక్షా 50వేలు మాత్రమే. నా కుమారుడి చికిత్స కోసం ఈ డబ్బు ఏవిధంగాను సరిపోదు. అదే సమయంలో పొలం అమ్మడం ద్వారా నా కుటుంబానికి తిండి లేకుండా పోతుంది.

కానీ అంతకన్నా నేనెం చేయగలను? కళ్లముందే కన్నబిడ్డ మరణిస్తుంటే ఏ తండ్రి అయినా ఎలా తట్టుకోగలడు? నా కొడుకును కాపాడుకోలేకుండా నేను మాత్రం ఎలా సంతోషంగా బతకగలను?. నా కొడుకును, నా కుటుంబాన్ని ఇద్దరిని నేను కాపాడాలనుకోవాలనుకుంటే నేను భూమి అమ్మడంతో పాటు నాకు మీ నుంచి కూడా కొంత మద్దతు కావాలి. నన్నూ, నా కుటుంబాన్ని ఆదుకోండి.

నిజానికి కృష్ణ పుట్టిన ఒక నెల రోజుల వరకు ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదు. కానీ ఆ తర్వాత ఓరోజు నిద్ర నుంచి లేస్తూనే కృష్ణ గట్టిగా ఏడ్వడం మొదలుపెట్టాడు. ఆ పసివాడి శరీరమంతా అప్పటికే కాలిపోతోంది. వెంటనే కృష్ణ ను ఎత్తుకుని స్థానిక ఆసుపత్రికి పరుగులు తీశాం. వాడికి ఏమవుతుందోనన్న ఆందోళనతో బిక్క చచ్చిపోయాం.

గత సెప్టెంబర్ నుంచి కృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నారు. ఆసుపత్రిలో నేను గడిపిన కొన్ని క్షణాలు భయం పుట్టించాయి. ఆ పసివాడి గుండె కొట్టుకోవడం పెరుగుతుంటే అలారం సౌండ్స్ మోగుతుండేవి. నర్సులు పరిగెత్తుకెళ్లి వాడికి చికిత్స అందిస్తుంటే.. ఏం జరుగుతుందోనని నా చేతులు చల్లబడిపోయేవి. శరీరమంతా వణుకు మొదలయ్యేది. ఆ క్షణం అనిపించింది.. ఒకవేళ వాడికేమైనా అయితే నేను తట్టుకోగలనా? అని.

ఆ పసివాడి శరీరానికి సెలైన్ నీడిల్స్ గుచ్చుతుంటే నా గుండె బద్దలైపోయేది. నొప్పితో వాడు అల్లాడిపోయేవాడు. మా సమస్యను దయా హృదయంతో అర్థం చేసుకుని మాకెవరైనా దాతలు విరాళం అందిస్మేంతే మా కుమారుడిని బతికించుకోగలుగుతాం. ఇప్పటికీ రూ.30వేలు చెల్లించాం. అంతకుమంచి చెల్లించే స్థోమత కూడా మాకు లేదు.

ఇప్పటిదాకా దాచుకున్న డబ్బులన్ని టెస్టుల కోసం, మెడిసిన్స్ కోసమే ఖర్చు చేశాం. తెలిసిన స్నేహితులను కూడా సహాయం కోరాం. చాలా సందర్భాల్లో మా ఇంట్లో కొంచెం ఆహారం మాత్రమే ఉండేది. అటువంటి సందర్భాల్లో వృద్దులైన మా తల్లిదండ్రులకు ఆ ఆహారం పెట్టి మేం పస్తులు ఉండేవాళ్లం. మేం తినకుండా అయినా ఉండగలం కానీ మా బిడ్డలకైనా తిండి పెట్టుకోకపోతే మేం వారిని కూడా కాపాడుకోలేనివారమవుతాం. ఖాళీ కడుపుతో పడుకునే బిడ్డలను చూసి గుండె తరుక్కుపోయేది.

నాకిప్పటికీ ఏం చేయాలో అంతుపట్టడం లేదు. ఒకవేళ ఎవరైనా అప్పు ఇచ్చినా.. తిరిగి దాన్ని తీర్చగలిగే స్థితిలో నేను ఉన్నానా?. ఇప్పుడున్న ఆలోచనైతే ఒకటే.. వీలైనంత తొందరగా రూ.3లక్షలను సమకూర్చుకుంటే తప్ప నా కొడుకును బతికించుకోలేను. ఆ పసివాడిని బతికించుకోవడానికి నాముందున్న మార్గాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. కెట్టో సంస్థ ద్వారా మీరు ఎంతో కొంత విరాళం మాకు అందించగలిగితే మేం మా కుమారుడిని బతికించుకోగలం.

English summary
My son Krishna was born on the 29th of July. He was natkhat right from the day he came into our lives, so his mother and I immediately agreed on naming him after Lord Krishna. Today my son is in the ICU battling a complex heart problem.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X