• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

''ఆ దుస్తులు ఉతకలేదు, ఆయనే నా హీరో, నక్షత్రాల్లోనే కూతురికి తండ్రిని చూపిస్తా''

By Narsimha
|

న్యూఢిల్లీ: నేను ఇప్పటికీ ఆయన సైనిక దుస్తులు ఉతకలేదు. ఆయనను బాగా మిస్ అయినట్టు అనిపిస్తే ఆయన దుస్తులు ధరిస్తానని ఉగ్రవాదుల దాడిలో మరణించిన ఆర్మీ మేజర్ భార్య సంగీత అక్షయ్ అభిప్రాయపడ్డారు. ఆ దుస్తుల వాసన అచ్చం ఆయనలానే ఉంటుందన్నారు. ఎప్పటికీ మా ఆయనే నా హీరో' సంగీత అక్షయ్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ పలువురిని కదలిస్తోంది.

ఉగ్రవాదుల దాడుల్లో చిక్కుకొన్న ప్రజలను ధైర్యంగా కాపాడిన ఆర్మీ మేజర్ చివరికి తన ప్రాణాలను కోల్పోయాడు. అయితే ఈ ఘటనలో ముగ్గురు ఆర్మీ అధికారులు చనిపోయారు.

కానీ , ఉగ్రవాదుల నుండి ప్రజలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అయితే అదే సమయంలో ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన కుటుంబాలు మాత్రం వీరమరణం పొందిన ఆర్మీ జవాన్ల గతాలను నెమరేసుకొంటూ కాలాన్ని వెల్లదీస్తున్నారు.

ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన కుటుంబాల పరిస్థితులు ఎలా ఉంటాయనే దానిపై సంగీత అక్షయ్ రాసిన పోస్ట్ నెటిజన్లను కంటతడిపెట్టిస్తోంది. ఈ పోస్ట్ చదివినవారెవ్వరికైనా మనసు చలించకమానదు . ఆర్మీ మేజర్ అక్షయ్ గిరీష్ సతీమణి సంగీత అక్షయ్ చేసిన పోస్ట్ పలువురిని కదిలిస్తోంది.

పెన్ డ్రైవ్‌తో ప్రపోజ్ చేశారు

పెన్ డ్రైవ్‌తో ప్రపోజ్ చేశారు

అది 2009 లో అక్షయ్ గిరిష్ నాకు ప్రపోజ్ చేసినప్పుడు ఆయన అనుకున్నట్టు జరగలేదని సంగీత అక్షయ్ గుర్తుచేసుకొన్నారు. చండీఘర్‌లో ఓ స్నేహితురాలితో పాటు వెళ్లి ఆయన్ను కలుసుకున్నాను. మేము సిమ్లాకి వెళ్లాం. కాని అక్కడ కర్ఫ్యూ విధించి ఉంది. ఆయన బుక్ చేసిన రెస్టారెంటు చాలా ముందుగానే మూసేశారు. దానికి తోడు ఆయన ఉంగరం తేవడం కూడా మర్చిపోయారు. చివరికి చేసేదేమీ లేక మోకాళ్లపై నిలబడి జేబులోనుంచి ఓ ఎర్రటి పెన్‌డ్రైవ్ తీసి ప్రపోజ్ చేశారని సంగీత అక్షయ్ గుర్తుచేశారు. 2011లో మేము వివాహం చేసుకున్నాం. రెండేళ్ల తర్వాత మాకు పాప పుట్టింది...'' అని సంగీత తమ తొలిరోజులను గుర్తుచేసుకున్నారు.

నా సంతోషాలు కూలిపోయాయి

నా సంతోషాలు కూలిపోయాయి

తన భర్తతో గడిపిన కొద్ది సమయం చాలా సంతోషంగా, సుఖంగా సాగిందని సంగీత అక్షయ్ అభిప్రాయపడ్డారు. 2016లో కలల సౌధం కళ్లముందే కూలిపోయింది. నవంబర్ 29న ఉదయం 5:30 గంటలకు కాల్పుల శబ్దం వినిపించి నిద్రలేచాం. ట్రైనింగ్‌లో భాగంగానే అనుకున్నాం కానీ అలాంటి సూచనలేవీ కనిపించలేదు. తర్వాత కొద్ది సేపటికే గ్రనేడ్లు పేలుతున్న శబ్ధం వినిపించింది. 5:45కి ఓ జూనియర్ మా వారి దగ్గరకు వచ్చి అసలు విషయం చెప్పాడు. ఉగ్రవాదులు ఆర్టిలరీ రెజిమెంటును చుట్టుముట్టారని చెప్పడంతో ఆయన వెంటనే సైనిక దుస్తులు ధరించి వెళ్లిపోయారు. వెళ్తూ వెళ్తూ దీని గురించి తప్పకుండా రాయాలి నువ్వు..అన్నారు. అదే ఆయన నాతో చెప్పిన చివరిమాట... అని సంగీత వెల్లడించారు.

ఫోన్ చేయాలన్నా చేతులు రాలేదు

ఫోన్ చేయాలన్నా చేతులు రాలేదు

తన భర్త అక్షయ్ బయటకు వెళ్ళిన చాలా సేపటివరకు కూడ సమాచారం రాలేదు. ఎంతో ఆందోళన చెందినట్టు ఆమె ఆ పోస్ట్‌లో ప్రస్తావించారు. సైనిక కుటుంబాలు, పిల్లలంతా చాలా ఆందోళన చెందినట్టు చెప్పారు. ఆ సమయంలో నా నరాలన్నీ బిగుసుకుపోయినట్టనిపించింది. ఏదో అస్పష్టమైన భావం నన్ను ఆవరించింది.
ఉదయం 11:30 గంటలయ్యింది. కనీసం ఫోన్ చేయాలన్నా నా చేతులు పనిచేయడం లేదు. చివరికి ఎలాకోలా ఫోన్ చేస్తే ఆయన బృందంలోని ఓ సైనికుడు ఫోన్ ఎత్తారు. మేజర్ అక్షయ్ ఎక్కడికో వేరే ప్రాంతానికి వెళ్లారని చెప్పారని ఆమె చెప్పారు.

ఆత్మవేరుపడింది

ఆత్మవేరుపడింది

సాయంత్రానికి తన భర్త చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది. దీంతో నా ప్రపంచం కూలిపోయిందని ఆమె గుర్తుచేసుకొన్నారు. దు:ఖంలో నుంచి తేరుకోలేకపోయాను. ఒక్కసారి మెసేజ్ పెట్టాలనుకున్నాను. ఒక్కసారి మనసారా ఆలింగనం చేసుకోవాలనుకున్నాను. ఒక్కసారి చివరిగా తనను ప్రేమిస్తున్నానని చెప్పాలనుకున్నాను. అయితే పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటాయని మేమెప్పుడూ అనుకోలేదు. చిన్నపిల్లలాగా ఏడుస్తూ ఉండిపోయాను. నాలోనుంచి ఆత్మ వేరైపోయినట్టుగా అనిపించిందంటూ ఆమె పోస్ట్ పెట్టారు.ఆయన గుర్తుకొచ్చినప్పుడు ఆయన చనిపోయిన సమయంలో వేసుకొన్న డ్రెస్ వేసుకొంటానని ఆమె చెప్పారు. ఇప్పటికీ కూడ ఆయన చనిపోయిన సమయంలో వేసుకొన్న డ్రెస్‌ను ఉతకలేదని ఆమె చెప్పారు.

నక్షత్రాల్లో తండ్రిని చూపిస్తాను

నక్షత్రాల్లో తండ్రిని చూపిస్తాను

తన కూతురు తండ్రి గురించి అడిగితే ఏం చెప్పాలో అర్ధం కాదని ఆమె పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే కొన్ని సమయాల్లో నక్షత్రాల్లో మీ నాన్న ఉన్నాడంటూ చెబుతానని ఆమె ఆ పోస్ట్‌లో ప్రస్తావించింది. కష్టాలను పక్కనపెట్టి చిరునవ్వుతో బతుకుతున్నామని ఆమె ఆ .పోస్ట్ చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An army wife’s touching post about dealing with the loss of her husband has left everyone teary-eyed. The gripping tale written by Sangeeta Akshay Girish throws light on what families go through when soldiers sacrifice their lives to protect the country.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more