డేరా బాబా రికార్డును బ్రేక్ చేయనున్న యోగి సర్కారు

ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం గిన్నీస్‌ రికార్డు సృష్టించనుంది. దీపావళి సందర్భంగా బుధవారం సాయంత్రం సరయు నదీతీరంతో పాటు అయోధ్య నగరంలో ఏకంగా రెండు లక్షల మట్టి దీపాలు వెలిగించి డ

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌‌లోని యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం గిన్నీస్‌ రికార్డుపై కన్నేసింది. దీపావళి సందర్భంగా బుధవారం సాయంత్రం సరయు నదీతీరంతో పాటు అయోధ్య నగరంలో ఏకంగా రెండు లక్షల మట్టి దీపాలు వెలిగించి డేరా అధినేత గుర్మీత్‌ సింగ్‌ సృష్టించిన రికార్డును బద్దలగొట్టనుంది.

అత్యాచార కేసుల్లో ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్‌.. 2016 సెప్టెంబర్‌ 23న హర్యానాలోని సిర్సా ప్రాంతంలో 1,50,009 దీపాలు వెలిగించి గిన్నీస్‌ రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం 'అయోధ్య దివ్య దీప్‌' ఉత్సవాల్లో భాగంగా ఆ రికార్డును చెరిపేయనుంది.

This Diwali in Ayodhya, Yogi govt plans to break a Guinness World Record held by Gurmeet Ram Rahim

ఈ కార్యక్రమంలో భాగంగా లేజర్‌ షోలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌, గవర్నర్‌ రామ్‌ నాయక్‌లు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారు.

సరయు ఘాట్‌, రామ్‌కీ పౌరి ఘాట్‌, రామ్‌కథా పార్క్‌ అనుసంధానంగా ఏర్పాటు చేసిన ఈ దీపాలను వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు, ఎన్‌సీసీ విద్యార్థులు వెలిగించనున్నారు. ఆ తర్వాత సీఎం, గవర్నర్‌తో పాటు పలువురు మంత్రులు సాయంత్రం 6.30 నిమిషాలకు నిర్వహించనున్న హారతి కార్యక్రమంలో పాల్గొంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+