నవ భారతం- ఇది మోదీ ప్రభుత్వం..: ఎర్రకోటపై ప్రధాని గర్జన
న్యూఢిల్లీ: యావత్ దేశం 77వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకొంటోంది. దేశం మొత్తం త్రివర్ణ పతాకాలు రెపరెపలాడుతోంది. నేషన్ ఫస్ట్- ఆల్వేస్ ఫస్ట్.. అనే థీమ్‌తో ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా జరుపుకోనున్నారు దేశ ప్రజలందరూ. జాతీయ సమగ్రత, దేశాభివృద్ధికి సంకేతంగా ఈ థీమ్‌ను రూపొందించింది ప్రభుత్వం.
పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ రాజధానిలోని ఎర్రకోటపై కొద్దిసేపటి కిందటే మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, జనాభాలోనూ అగ్రస్థానంలో ఉన్న భారత్.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకొంటోందని పేర్కొన్నారు.

జనాభా, అతిపెద్ద ప్రజాస్వామ్యం, వైవిధ్యం.. అనే ఈ మూడు అంశాలకు దేశ ప్రజల కలలను సాకారం చేసే శక్తి ఉందని మోదీ చెప్పారు. మనం తీసుకునే నిర్ణయాలు, చేసే చర్యలు.. వచ్చే 1000 సంవత్సరాల్లో దేశ బంగారు చరిత్రకు అంకురార్పణ చేస్తుందని, చరితార్థం చేస్తుందని మోదీ పేర్కొన్నారు.
2014లో తాము అధికారంలోకి వచ్చినప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ది 10వ స్థానంలో ఉండేదని, ఇప్పుడు అయిదో స్థానానికి చేరుకున్నామని ప్రధాని మోదీ అన్నారు. తన ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగాయంటూ ప్రతిపక్షాలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. దాని ఫలితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ పదో స్థానానికి దిగజారిందంటూ ధ్వజమెత్తారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నవ భారత నిర్మాణం జరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించాలనే చర్చ దేశంలో 25 సంవత్సరాలుగా సాగుతోందని, ఎవ్వరూ దాన్ని కార్యరూపంలోకి పెట్టలేకపోయారని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక గడువు కంటే ముందే కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించామని అన్నారు.
ఇది మోదీ ప్రభుత్వం అని, ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రతీక అని మోదీ పేర్కొన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడమే కాదు.. దాన్ని అనుకున్న సమయం కంటే ముందే ఛేదించడమూ తమకు తెలుసునని అన్నారు. అలసిపోయే, ఆగిపోయే, ఓడిపోయే భారత్ కాదు.. ఇప్పుడున్నది ఆత్మనిర్భర్ భారత్ అంటూ ప్రధాని భావోద్వేగంతో చెప్పుకొచ్చారు.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications