వెళ్లిపోయినోళ్ల భవిష్యత్ గురించి భయపడుతున్నా: శరద్ పవార్
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అజిత్ పవార్.. ఊహించని విధాంగా షాక్ ఇచ్చారు. శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం)- బీజేపీ కూటమి ప్రభుత్వానికి జైకొట్టారు. షిండే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రిగానూ ప్రమాణ స్వీకారం చేశారు.
ఆయనతో పాటు తొమ్మిది మంది ఎన్సీపీ శాసన సభ్యులు- హసన్ ముష్రిఫ్, ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వల్సే పాటిల్, ధనంజయ్ ముండే, ఆదితి టత్కరే, సంజయ్ బాబురావ్ బన్సొడే, అనిల్‌భాయ్ దాస్ పాటిల్, ఆత్రమ్ ధర్మారావ్ బాబా భగవంత్ రావ్.. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ముంబైలోని రాజ్‌భవన్‌లో ఈ మధ్యాహ్నం గవర్నర్ రమేష్ బైస్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ పరిణామాలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. ఇన్ని సంవత్సరాలు ఓ కుటుంబ సభ్యులుగా పార్టీ కొనసాగిందని, ఇప్పుడు ఇది విడిపోయినట్లుగా భావించట్లేదని అన్నారు. ఇప్పటికీ కుటుంబం కలిసే ఉందని పేర్కొన్నారు. ఈ సమస్య తన ఇంటికి సంబంధించినది కాదని చెప్పారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన వారి భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నానని వ్యాఖ్యానించారు.
పార్టీలో చీలికను తీసుకుని వచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీదేనని శరద్ పవార్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు జరుగుతాయంటూ ప్రభుత్వ పెద్దలు రెండు రోజుల కిందటే హెచ్చరించారని గుర్తు చేశారు. ఆ ప్రకటన తరువాత తమ పార్టీలో అలజడి మొదలైందని, కొందరు నాయకులు ఈడీ కేసులను ఇప్పటికే ఎదుర్కొంటున్నారని చెప్పారు.
బీజేపీ హైకమాండ్.. ఎన్సీపీపై సంధించిన గూగ్లీగా దీన్ని భావించట్లేదని, ఇదొక బహిరంగ దోపిడీ అని శరద్ పవార్ అభివర్ణించారు. మళ్లీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలే తమ ప్రధాన బలం.. వాళ్లే తమను ఎన్నుకున్నారని వ్యాఖ్యానించారాయన. తిరుగుబాటు నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరేలకు పార్టీలో కీలక పదవులు ఇచ్చానని, అయినా వారు తిరుగుబాటు లేవనెత్తారని, వారిపై చర్యలు తప్పవని శరద్ పవార్ హెచ్చరించారు. మరో రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్, ఉద్ధవ్ థాకరేతో సమావేశమౌతామని, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై నిర్ణయం తీసుకుంటామని శరద్ పవార్ వివరించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. వంటి నాయకులు ఫోన్ చేశారని, వారికి వివరాలన్నింటినీ తెలియజేశానని చెప్పారు. ఇవ్వాళ ఏమి జరిగిందనే విషయంపై తాను చింతించట్లేదని అన్నారు. ముంబైలో సోమవారం బహిరంగ సభ నిర్వహిస్తానని, అజిత్ పవార్ లేవనెత్తిన తిరుగుబాటును ప్రజలకు వివరిస్తానని చెప్పారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications