వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇది జైశ్రీరామ్ అనే 'రామభక్త' ప్రభుత్వం: గడ్కరీ, రామ్-జానకి రోడ్డు..

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమది రామభక్త ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్య సమీపంలో ఆయన మాట్లాడారు. అయోధ్య నుండి చిత్రకూట్ వరకు ఈ ప్రభుత్వం రామభక్త ప్రభుత్వమని, ఎవరైతే జై శ్రీరామ్ అని నినదిస్తారో వారిదే అన్నారు.

ఈ ప్రాంతంలో ఓ రహదారి శంకుస్థాపన సందర్భంగా మాట్లాడారు. నేపాల్‌లో సీత పుట్టిన చోటు జానక్‌పూర్ నుండి శ్రీరాముడు పుట్టిన అయోధ్య వరకు రోడ్డును నిర్మిస్తున్నామని, దానికి రామ్ - జానకి మార్గ్ పేరు పెడుతున్నట్లు చెప్పారు.

'This is a Government of Ram Bhakts,' Says Union Minister Nitin Gadkari

ఈ రహదారి నిర్మాణానికి రూ.2000 కోట్లు ఖర్చవుతుంది. గతంలో హిందువుగా ఉండి పాలకుల ఒత్తిడి కారణంగా ఇతర మతాలను తీసుకున్న వారిని తిరిగి హిందువులుగా మార్చేందుకే ఘర్ వాపసీ ప్రారంభించారని చెప్పారు. కాగా, గడ్కరీ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది.

కాగా, ఇది ఆధ్యాత్మిక పర్యాటకానికి దోహదం చేసే భారీ ప్రాజెక్టు. ఉత్తర ప్రదేశ్‌లోని రామ జన్మభూమి అయోధ్య, నేపాల్‌లోని సీతమ్మ జన్మభూమి జనక్‌పూర్‌ మధ్య భారీ రహదారిని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. వివాహం తర్వాత సీతారాములు ఈ మార్గం నుంచే అయోధ్య చేరారని రామాయణం చెపుతోంది.

English summary
In a comment that could ignite a political row, Union Minister Nitin Gadkari has declared, "We are a government of Ram Bhakts."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X