వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాకు ఇవే చివరి ఎన్నికలు, అంతిమం బాగుంటే అంతా మంచే: నితీష్ కుమార్ సంచలన ప్రకటన

|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. తనకు ఈ ఎన్నికలే చివరి ఎన్నికలని ప్రకటించారు. అంతిమ విజయం అందరికీ మంచి జరుగుతుందన్నారు. ఈసారి ఎన్నికల్లో గెలిపించి బీహార్ అభివృద్ధిని కొనసాగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

 బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత నితీష్ కుమార్ తేజస్వీయాదవ్ ముందు తలొంచుతాడు .. చిరాగ్ ఫైర్ బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత నితీష్ కుమార్ తేజస్వీయాదవ్ ముందు తలొంచుతాడు .. చిరాగ్ ఫైర్

ఇవే నాకు చివరి ఎన్నికలు

ఇవే నాకు చివరి ఎన్నికలు

పూర్నియాలో జేడీ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించిన సమయంలో నితీష్ కుమార్ ఈ మేరకు ప్రకటించారు. ‘ఈ ఎన్నికల చివరి రోజు. ఈ ఎన్నికల మరుసటి రోజు ముగుస్తుంది. ఇది నా చివరి ఎన్నిక. అంతిమ్ భలాతో సబ్ భాలా (అంతిమ విజయం బాగుంటే అంతా బాగుటుంది)' అని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

ఎన్డీఏ ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా నితీష్..

ఎన్డీఏ ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా నితీష్..

ఆ తర్వాత విపక్షాలపై నితీష్ కుమార్ విమర్శలు గుప్పించారు. ఆర్జేడీ అధికారంలోకి వస్తే మళ్లీ లాంతర్లు వెలిగించుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. తానున్న లేకపోయిన బీజేపీతో భాగస్వామ్యం మాత్రం ఉంటుందని అన్నారు. నితీష్ కుమార్ బీజేపీతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్ బరిలో ఉన్నారు.

నితీష్ ప్రకటనతో.. జేడీయూలో కలకలం

నితీష్ ప్రకటనతో.. జేడీయూలో కలకలం

కాగా, నితీష్ కుమార్ తనకు ఇవే చివరి ఎన్నికలు అని ప్రకటించడం ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. జేడీయూ అధినేతగా ఉన్న నితీష్ రాజకీయాల నుంచి నిష్క్రమిస్తే ఆ పార్టీ భవిష్యత్ ఏంటీ? అని అభిమానులు, నేతలు మదనపడుతున్నారు. నితీష్ లేకుంటే జేడీయూ మనుగడ కష్టమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇక జేడీయూ మిత్రపక్షమైన బీజేపీలోనూ నితీష్ రిటైర్మెంట్ ప్రకటన చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే ఐదుసార్లు సీఎంగా నితీష్..

ఇప్పటికే ఐదుసార్లు సీఎంగా నితీష్..

ఇప్పటికే ఐదుసార్లు బీహార్ ముఖ్యమంత్రిగా ఎన్నికైనా నితీష్ కుమార్ రికార్డు సృష్టించారు. తాజా ఎన్నికల్లో విజయం సాధించి ఆరోసారి కూడా సీఎం పీఠాన్ని అధిరోహిస్తాననే నమ్మకంతో ఉన్నారు. బీజేపీ అభ్యర్థులు, నితీష్ కుమార్‌కు మద్దతుగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా బీహార్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 2013లో నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా వ్యతిరేకించి ఎన్డీఏ నుంచి వైదొలిగిన నితీష్ కుమార్.. ఆ తర్వాత మళ్లీ ఎన్డీఏలో చేరారు. ఈ క్రమంలో పలుమార్లు ప్రధాని మోడీపై నితీష్ ప్రశంసలు కురిపించారు. ఆయన నాయకత్వంలో దేశం, రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకుసాగుతున్నాయన్నారు.

English summary
Nitish Kumar announced a rally today that this Bihar election is his last. The stunning announcement came while the Bihar Chief Minister was campaigning for a candidate of his Janata Dal United in Purnia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X