బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇది స్విట్జర్లాండ్‌లో మంచు కాదు... బెంగళూరులో బెల్లందూర్ సరస్సు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఇదిగో ఫోటోలో కనిపిస్తోంది ఏ స్విట్జర్లాండ్‌లో మంచు అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.అది స్విట్జర్లాండ్‌లో హిమపాతం కాదు... దక్షిణాది రాష్ట్రం కర్నాటకలోని బెలందూర్ చెరువులో కనిపించిన దృశ్యం. మీరనుకుంటున్నట్లు అది మంచు కాదు.. బెలందూర్ లోని చెరువులోని పొంగుతున్న నురుగు.

బెలందూర్ సరస్సు నుంచి మళ్లీ అదే నురుగు

బెలందూర్ సరస్సు నుంచి మళ్లీ అదే నురుగు

ఇక అసలు విషయానికొస్తే... కొన్ని నెలల క్రితం నురుగుతో పొంగిన బెల్లందూర్ సరస్సు మళ్లీ ఇంతకాలానికి నురుగుతో పొంగి పాదాచారులను పలకరిస్తోంది. ఇది ఇప్పటికైతే ఈ చెరువు నుంచి వచ్చే దుర్గంధాన్ని, హానికరమైన వాయువులను బెంగళూరు వాసులు పీల్చుకోక తప్పదు. ఎందుకంటే ఇంతకుముందే ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పటికీ అక్కడి మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం అది 10 మీటర్ల ఎత్తు వరకు పొంగి రహదారిపైకి వస్తోంది. ఈ పరిస్థితిని చూసి చాలా ఇబ్బంది పడుతున్నారు బెంగళూరు వాసులు. సోమవారం కురిసిన భారీ వర్షాలకు ఈ సరస్సు ఇలా పొంగింది.

టూరిస్ట్ స్పాట్‌గా తయారైన సరస్సు

టూరిస్ట్ స్పాట్‌గా తయారైన సరస్సు

ప్రస్తుతం ఇదొక టూరిస్ట్ స్పాట్‌గా తయారైందని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ ఇటు వెళ్లే వారు ఆగి మరీ సెల్ఫీలు దిగుతున్నారని చెబుతున్నారు. ఇప్పటికే సరస్సును పరిరక్షించేందుకు గాను బడ్జెట్‌లో రూ.50 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. కానీ తీసుకుంటున్న చర్యలు మాత్రం శూన్యం అని స్థానికులు వాపోయారు. దీనిపై వాదనలను హరిత ట్రైబ్యునల్ అక్టోబర్‌కు వాయిదా వేసిందన్నారు.ఎప్పుడైతే నురుగు పొంగి రోడ్ల మీదకు ప్రవహిస్తుందో అప్పుడు మాత్రమే బెలందూర్ సరస్సు వార్తల్లో నిలుస్తుందని మిగతా సమయాల్లో ఈ అంశం గాలికి వదిలేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దుర్గంధం,విషవాయువులతో అంటురోగాలు

దుర్గంధం,విషవాయువులతో అంటురోగాలు

చెరువు నుంచి వస్తున్న దుర్గంధం ఇబ్బంది పెడుతోందని, అంటువ్యాధులు, నీరు కలుషితం అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ప్రభుత్వానికి మాత్రం తమ గోడు పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలంలో సరస్సు నుంచి మంటలు చెలరేగుతాయని... చలికాలంలో ఇలా నురుగు ఇబ్బంది పెడుతోందని అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం దీని గురించి పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. కంటితుడుపు చర్యలు తీసుకుని మళ్లీ దాన్ని అలాగే వదిలేస్తున్నారని ధ్వజమెత్తారు స్థానికులు.

English summary
In what’s become Bengaluru’s never-ending tragedy, the Bellandur and Varthur Lakes are frothing again. Tuesday morning saw a slush of unpleasant, smelly and toxic froth climb up the 10 ft mesh and flow into the roads, saying hello to the pedestrians and motorists, who covered their noses with disgust. The foam follows heavy rains on Monday evening.Unfortunately for residents, the toxic foam has become so infamous that it’s inadvertently become a local tourist attraction.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X