వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విలువలు, జీవితం గురించి ప్రేమతో కూతురుకి చందాకొచ్చర్ లేఖ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ముంబై: చందా కొచ్చర్... భారత్‌లోనే అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్‌ ఐసీఐసీఐకి సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహారిస్తున్నారు. అంతేనా గతేడాది టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాలో కూడా ఆమె చోటు దక్కించుకున్నారు.

ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన చందా కొచ్చర్ పవర్‌ఫుల్ అండ్ సక్సెస్‌ఫుల్ ఉమెన్‌గా పేరు తెచ్చుకున్నారు. 54 ఏళ్ల చందా కొచ్చర్ ఓ తల్లిగా, సక్సెస్‌ఫుల్ ఉమెన్‌గా తన అనుభవాలను కూతురికి చెప్తూ ఓ లేఖ రాశారు.


డియర్ ఆర్తీ,
నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉన్నది. జీవితాన్ని గెలవడానికి కావల్సిన ఆత్మవిశ్వాసం నీలో కనిపిస్తుంది. ఈ సందర్భంగా నీ జీవితంలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనలను, నా అనుభవాలను, వాటి నుంచి నేను నేర్చుకున్న పాఠాలను నీతో పంచుకుంటున్నా. చిన్నతనంలోనే ఎన్నో పాఠాలు నా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నా. అలా అని వారేమీ నాకు వేలుపట్టి నేర్పలేదు. వారి నడవడిక, ఆదర్శాలు, విలువలు, వారి జీవితమే నాకు పాఠాలు నేర్పింది.

This Open Letter From ICICI Bank CEO Chanda Kochhar To Her Daughter Aarti Is An Inspiration To All Working Mothers

అమ్మానాన్నలకు మేం ముగ్గురం సంతానం. ఇద్దరం అమ్మాయిలం, ఒక అబ్బాయి. మా ముగ్గురినీ సమానంగా పెంచారు. చిన్నతనంలో ఆడపిల్లల పట్ల సమాజంలో ఎంతో వివక్ష ఉన్నప్పటికీ మా అమ్మానాన్నలు మా పట్ల వివక్ష చూపలేదు. మీ అమ్మమ్మ, తాతయ్యలు అన్ని విషయాల్లో మా ముగ్గుర్ని సమానంగానే చూశారు. మా నిర్ణయాల్ని గౌరవించారు. మా లక్ష్యాల్ని మేమే నిర్దేశించుకునేలా తీర్చిదిద్దారు. నన్ను నేను వెతుక్కోవడంలో, నాకు నేను దొరకడంలో వారి పెంపకం నాకెంతో ఉపయోగపడింది.

అప్పుడు నాకు 13 ఏళ్లు. గుండెపోటుతో మా నాన్న చనిపోయారు. ఇది మన కుటుంబానికి పెద్ద షాక్. అప్పటికి మేమింకా స్వంతంగా బతకడానికి సిద్ధంగా లేం. అసలా ఆలోచనే రాలేదు. రాత్రికి రాత్రే మా జీవితాలకు కొన్ని లక్ష్యాలు ఏర్పడ్డాయి. కుటుంబ బాధ్యతలన్నీ అమ్మమ్మ భుజాన వేసుకుంది. ఎదుగుతున్న పిల్లల చదువు, పోషణ భరించడం ఆరోజుల్లో ఒక మహిళకు చాలా కష్టం. కానీ ఆమె ఆ కష్టాలేవీ తెలియనిచ్చేది కాదు. ఎన్ని ఇబ్బందులొచ్చినా మాకెప్పుడూ ఏ లోటూ రానివ్వలేదు.

క్లిష్ట పరిస్థితుల్లో ఎలా ఉండాలో అమ్మను చూసి నేర్చుకున్నాం. ఆ ఓపిక, ప్రవర్తన, మాకూ అలవడ్డాయి. కుటుంబ పోషణ కోసం ఆమె టెక్స్‌టైల్స్ నడిపేది. ఆపదొచ్చినప్పుడు ఆమె స్పందించిన తీరు, తీసుకునే నిర్ణయాలు మాకు ఒక పాఠంలా అనిపించింది. సమస్యలు సవాల్ చేస్తే, వాటిని ఎదుర్కొని తిరిగి సవాల్ చేసేది. ఇదంతా చేస్తున్న ఆమె ఎప్పుడూ చిరునవ్వు చెరగనివ్వలేదు. మా చదువు పూర్తయి, మా కాళ్ల మీద మేం నిలబడే వరకు మాకోసం పని చేస్తూనే ఉంది. అప్పటి వరకు తెలియదు మాకు... అమ్మలో అంత ఆత్మైస్థెర్యం ఉందని.

This Open Letter From ICICI Bank CEO Chanda Kochhar To Her Daughter Aarti Is An Inspiration To All Working Mothers

ఒక పేరెంట్‌గా ఎంత పని ఒత్తిడి ఉన్నా అది ఇంట్లోకి తీసుకురాకపోవడం మా అమ్మ దగ్గరే నేర్చుకున్నా. మీ దగ్గర నేను కూడా అలాగే ఉన్నా. నీకు గుర్తుందా...? అప్పుడు నువ్వు అమెరికాలో చదువుతున్నావు. ఐసీఐసీఐ బ్యాంకుకి ఎండీగా, సీఈవోగా నియమిస్తూ మీడియా నా గురించి కథనాలు రాసింది. అప్పుడు నువ్వు నాకో మెసేజ్ మెయిల్ చేశావ్. నాకది ఇంకా గుర్తుంది. అమ్మా... నువ్వు ఈ స్థాయిలో ఉంటావని మేం అస్సలు ఊహించలేదు. ఇంత ఒత్తిడి ఉండే కెరీర్‌లో సక్సెస్‌ఫుల్‌గా ఎదిగావు. అయినా నువ్వెప్పుడూ ఉద్యోగాన్ని ఇంటికి తీసుకురాలేదు. ఇంట్లో ఎప్పుడూ అమ్మగానే ఉన్నావ్ అని నువ్వు పంపిన మెసేజ్ నేనెప్పటికీ మరిచిపోలేను. ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఆర్తీ.. నీ జీవితాన్ని నీకు నచ్చినట్టుగా జీవించు. అదే నీ గెలుపునకు పునాది.

2008లో అనుకుంటా. ఐసీఐసీఐ బ్యాంకు నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదంలో పడింది. దానికి కారణం ప్రపంచమంతా ఆర్థికమాంద్యం. అప్పుడే.. ఒకరోజు నేను మీ తమ్ముడు ఆడుతున్న స్కాష్ టోర్నమెంట్‌కి వెళ్లాను. అక్కడ నేనూహించని పరిణామం ఒకటి జరిగింది. అదే మా బ్యాంకు తిరిగి కోలుకోవడానికి కారణమయింది. ఆ మ్యాచ్ చూడడానికి వచ్చిన చాలామంది మహిళలు నన్ను చూసి దగ్గరికి వచ్చారు. వారడిగిన ప్రశ్నలన్నిటికీ ఓపిగ్గా సమాధానమిచ్చా. బ్యాంకు సేఫ్ హ్యాండ్స్‌లోనే ఉంది అని తిరిగి వారు మాట్లాడుకుంటూ వెళ్లిపోయారు. అది నాకు నమ్మకాన్నిచ్చింది. ఆ నమ్మకంతోనే ఒక పద్ధతి ప్రకారం వాటాదారులను కమ్యూనికేట్ చేశా. చిన్న చిన్న డిపాజిటర్ల నుంచి పెట్టుబడిదారుల వరకు చాలామందిని కలిశా. మంచి స్పందన వచ్చింది. కష్టాల్లోంచి బయటపడ్డా.

నా చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా నాకు నేనుగా కెరీర్‌లో ఎదగడానికి సహకరించాయి. కుటుంబ సహకారం విషయానికొస్తే మీ అమ్మమ్మ, నానమ్మ, మీ నాన్న, మీ మేనత్తలు అందరూ నాకు అండగా నిలిచారు. వారంతా ప్రేమగా నన్ను ప్రోత్సహిస్తుంటే నేను వెనకకు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. నువ్వు బాగా గుర్తుపెట్టుకో... సంబంధాలనేవి చాలా విలువైనవి. కెరీరే ముఖ్యమనుకుంటే రిలేషన్స్ మిగలవు. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి. మనకు తెలిసిన వ్యక్తి నుంచి మనం ఊహించని పరిణామం ఎదురుకావొచ్చు. అన్నింటినీ ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధం కావాలి. నేను ఇంటికి, కుటుంబానికి టైమ్ కేటాయించడం లేదని ఎన్నడూ మీ నాన్న గానీ, ఇతర కుటుంబసభ్యులు గానీ అనలేదు. ఎందుకంటే నా కుటుంబానికి నేనెప్పుడూ దూరం కాలేదు. ఎంత పని ఒత్తిడి ఉన్నా, ఫ్యామిలీ రిలేషన్స్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చా. నువ్వు కూడా నీ పార్ట్‌నర్‌తో ఇలాంటి రిలేషనే కొనసాగిస్తావనుకుంటున్నా. నేను మంచి సపోర్టీవ్ ఫ్యామిలీలో ఉన్నందుకు అదృష్టవంతురాలిని. నువ్వు కూడా అలాగే ఉండాలని నా ఆశ.

నాకు బాగా గుర్తు... నువ్వు బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు నేను నీకు తోడుగా వచ్చా. అంతకుముందు అన్ని పరీక్షలకు నువ్వు ఒంటరిగానే వెళ్లావు. అప్పుడు నువ్వో మాటన్నావు గుర్తుందా... అమ్మా... నువ్వెప్పుడూ ఒంటరిగానే వెళ్లేదానివి కదా ఎగ్జామ్స్‌కి అని. నాకు ఆ మాటలు చాలా బాధ కలిగించాయి. నేను నీ స్వేచ్ఛను హరిస్తున్నానేమో అనిపించింది. కానీ ఆర్తీ... ఒక్క విషయం... నేను నీ స్వేచ్ఛను ఎప్పుడూ హరించను. నువ్వొక వండర్‌ఫుల్, ఇండిపెండెట్ ఉమెన్‌గా ఎదగాలని కోరుకునే వారిలో నేను ముందుంటా.

This Open Letter From ICICI Bank CEO Chanda Kochhar To Her Daughter Aarti Is An Inspiration To All Working Mothers

నేను అదృష్టాన్ని నమ్ముతా.. కానీ కష్టాన్ని ఇంకా ఎక్కువ నమ్ముతా. పని, శ్రద్ధ ఈ రెండే మన జీవితంలో మనల్ని గెలిపించేవి. ప్రతీ ఒక్కరూ గమ్యాల్ని నిర్దేశించుకుంటారు. ఆ గమ్యాల్ని చేరుకోవడంలో మనదైన ముద్ర వేయాలి. అప్పుడే అందరిలో మనం ప్రత్యేకంగా కనిపిస్తాం. అడ్డదారుల్లో ఒకేసారి విజయాన్ని సాధించే కంటే.. ఎక్కే ప్రతీ మెట్టులోని విజయాన్ని ఆస్వాదిస్తూ అంతిమంగా సాధించిన విజయమే ఆత్మ సంతృప్తినిస్తుందని మర్చిపోకు.

జీవితంలో చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఎవరి మీదో ఆధారపడకుండా.. నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి. నీ శక్తి మేరకు ప్రయత్నించు. ఒకవేళ నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పైతే దాన్నుంచి ఒక పాఠం నేర్చుకో. అంతేగానీ నిర్ణయాలు తీసుకోవడంలో ఇతరుల సహాయం తీసుకోవద్దు. అది మన గమ్యాన్ని డిస్టర్బ్ చేస్తుంది.

ఆర్తీ.. ఏదైనా సాధించడానికి హద్దులుండవు. చేసుకుంటూ వెళ్లిపోతూనే ఉండాలి. లక్ష్యాన్ని చేరుకునే దశలో విలువల్ని పాటించాలి. నిజాయితీ ఎప్పుడూ నీ నీడలా ఉండేలా చూస్కో. అడ్డంకులు వస్తే దాటుకుని పోవాలి. అంతేకానీ.. వాటిని తప్పించుకోవడానికి ఎగరకూడదు. నీ చుట్టూ సున్నిత మనస్కులు ఉంటారు. వారిని ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టకు. ఒత్తిడి నీ దగ్గరకు రానీయకు. అది నీ డైరీలో, నీ జీవితంలో ఉండనివ్వకు.

గుర్తుంచుకో.. మంచిరోజులూ.. చెడు రోజులూ జీవితంలో సమానంగా ఉంటాయి. ముందు మంచి రోజులు వస్తే భవిష్యత్తులో చెడు రోజులు కూడా ఉంటాయని గుర్తు పెట్టుకో! ఎలాంటి సమయంలోనైనా ఒకేలా ఉండగలిగే ఆత్మైస్థెర్యాన్ని పెంపొందించుకో. ప్రతీ అవకాశాన్ని, ఛాలెంజ్‌ను స్వీకరించు.

- ప్రేమతో, నీ అమ్మ
(చందాకొచ్చార్)

English summary
Chanda Kochhar, Managing Director and Chief Executive Officer of ICICI Bank, who featured on Time magazine's list of the '100 Most Influential People in the World' last year, has now emerged as an inspiration for millions of women with her inspirational open letter to her daughter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X