బిజెపికి షాకిచ్చిన చాయ్‌వాలా: యూపీలో చరిత్ర సృష్టించిన అనూజ్

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో: 2014 ఎన్నికల సమయంలో చాయ్‌వాలా... దేశంలో ప్రముఖంగా మార్మోగిపోయింది. ఈ నినాదం గత ఎన్నికల సమయంలో బిజెపికి వరంగా మారింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడ ఈ నినాదం విస్తృతంగా ప్రచారంలో ఉంది. అయితే ఇటీవల జరిగిన యూపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓ చాయ్ వాలా బిజెపి అభ్యర్థిని ఓడించాడు. ఈ చాయ్ వాలా సమాజ్‌వాదీ పార్టీ తరపున పోటీ చేశాడు.

యూపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి భారీ విజయాన్ని సాధించింది. అయితే ఓ బిజెపి అభ్యర్థిపై సమాజ్‌వాదీ పార్టీకి చెందిన చాయ్‌వాలా విజయం సాధించారు. పదిసార్లు విజయం సాధించిన బిజెపి అభ్యర్థిపై ఈ చాయ్‌వాలా విజయం సాధించారు.

This Samajwadi 'Chaiwala' Defeated BJP Candidate in UP Civic Polls

చిత్రకూట్‌కు చెందిన 21 ఏళ్ల అనూజ్‌నిగమ్‌ స్థానికంగా చాయ్‌ దుకాణం నిర్వహిస్తున్నాడు. . మున్సిపల్‌ ఎన్నికల్లో 21వ వార్డు నుంచి భాజపా అభ్యర్థి అజయ్‌కుమార్‌పై ఎస్పీ అభ్యర్థిగా పోటీకి దిగారు.

ఈ ఎన్నికలో అనూజ్‌ 326 ఓట్లు సంపాదించుకోగా.. అజయ్‌కుమార్‌ 286 ఓట్లకే పరిమితమయ్యారు. దీంతో అక్కడ గతంలో పదిసార్లు విజయం సాధించిన అజయ్‌పై అనూజ్‌ సంచలన విజయం సాధించారు.

ఓ చాయ్‌వాలా దేశానికి ప్రధాని అయితే .. మున్సిపల్‌ కౌన్సిలర్‌ ఎందుకు కాకుడదంటూ అనూజ్ అని ప్రశ్నించారు. పోలింగ్‌కు ముందు ఇంటింటి ప్రచారం నిర్వహించా. నా టీ స్టాల్‌ కూడా నా విజయంలో కీలక పాత్ర పోషించింది.

ఇక్కడికీ టీ తాగడానికి వచ్చిన వారితో నాకు మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. దీంతో నా ప్రచారం కూడా తేలిక అయింది. నాకు సీటిచ్చిన సమాజ్‌వాదీ పార్టీకి కృతజ్ఞతలు. అంటూ అనూజ్ చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
While we are all very familiar to Prime Minister Narendra Modi’s ‘chaiwala’ stories, this other ‘chaiwala’, a 21-year-old from Chitrakoot, who defeated a BJP candidate in the civic elections, is set to write his own story.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి