ఈ దేశంలో ఇంగ్లీష్ లో మాట్లాడే వాళ్లు సిగ్గు పడే రోజులొస్తాయ్..!!

Amit Shah: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. కీలక వ్యాఖ్యలు చేశారు. భాషల అంశాన్ని మరోసారి ప్రస్తావించారు. హిందీ సహా ఇతర ప్రాంతీయ భాషలను బతికించుకోవాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో ఇంగ్లీష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు అమిత్ షా. ఈ దేశంలో ఇంగ్లీష్ లో మాట్లాడే వాళ్లు త్వరలోనే సిగ్గుపడే రోజులొస్తాయనీ స్పష్టం చేశారు.

భాషా వారసత్వాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని, దీనికోసం దేశ ప్రజలు తమవంతు ప్రయత్నాలు చేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు. ప్రాంతీయ భాషలే ఈ దేశానికి అసలైన గుర్తింపును తీసుకొస్తాయని, విదేశీ భాషల కంటే వీటికే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.

Those who speak English will soon feel ashamed in this country says Amit Shah

మాజీ ఐఏఎస్ అధికారి అశుతోష్ అగ్నిహోత్రి రచించిన మై బూంద్ స్వయం, ఖుద్ సాగర్ హూ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. యావత్ దేశం వలస పాలన మిగిల్చిన అవశేషాలను విడిచిపెట్టిందని, ఇప్పుడు స్వభాషను గర్వంగా స్వీకరించాలని ప్రజలకు సూచించారు.

ఈ దేశంలో ఇంగ్లీష్ మాట్లాడేవారు త్వరలోనే సిగ్గుపడతారు. అటువంటి సమాజం ఏర్పడటం ఎంతో దూరంలో లేదు. దృఢ సంకల్పం ఉన్నవారే ఈ మార్పును తీసుకురాగలరు. మన దేశ భాషలు మన సంస్కృతికి ఆభరణాలు అని నమ్ముతున్నాను.. అని అమిత్ షా చెప్పారు. స్వభాషలు లేకుండా.. మనం నిజంగా భారతీయులమని అనిపించుకోలేమని అన్నారు.

భారతీయ సంస్కృతి- సంప్రదాయాలు, చరిత్ర సారాన్ని విదేశీ భాషలు ఎంతమాత్రం కూడా సంగ్రహించలేవని అమిత్ షా పేర్కొన్నారు. మన దేశాన్ని, సంస్కృతిని, చరిత్రను, మతాన్ని అర్థం చేసుకోవడానికి, ఏ విదేశీ భాష కూడా సరిపోదని, సగం కాలిన విదేశీ భాషల ద్వారా పరిపూర్ణ భారత్.. ఏర్పడుతుందని అనుకోలేమని చెప్పారు.

ఇంగ్లీష్ కు వ్యతిరేకంగా యుద్ధాన్ని చేపట్టడం ఎంత కష్టమో తనకు తెలుసునని, ఇందులో భారత సమాజం గెలుచి తీరుతుందనే విశ్వాసం తనకు ఉందని అమిత్ షా అన్నారు. త భాషలలో నడుపుతాము మరియు ప్రపంచాన్ని కూడా నడిపిస్తాము, "అని ఆయన అన్నారు.

అమృత్ కాల్ ను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయిదు ప్రతిజ్ఞలు చేశారని, అవే- పరిపూర్ణ భారత దేశం ఆవిర్భావానికి పునాదులని అమిత్ షా అన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించడం, బానిసత్వపు జాడలను వదిలించుకోవడం, దేశ వారసత్వం పట్ల గర్వపడటం, ఐక్యత, సంఘీభావానికి కట్టుబడి ఉండటం.. అనేది ప్రతి పౌరుడూ అలవర్చుకోవాలని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+