ప్రయాణికుల్లా పోలీసులు.. ఆటోడ్రైవర్లకు షాక్..
మహా నగరాల్లో ఆటోడ్రైవర్ల మోసాలు అంతా ఇంతా కాదు, మోసాలకు అడ్డుకట్టవేసేందుకు నిబంధనలు ఉన్నా..., వాటిని యధేచ్చగా ఉల్లంఘిస్తూ...అడ్డుఅదుపు లేకుండా.... ప్రయాణికులపై భారాన్ని వేస్తారు...అవసరాన్ని బట్టి డబ్బులు గుంజుతారు. మీటరు ఉన్నా వేసేందుకు అంగీకరించరు. దీంతో చాలామంది క్యాబ్‌లపై ఆధారపడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే సిలికాన్ వ్యాలి నగరమైన బెంగళూర్‌లో పోలీసులు కొత్త స్కెచ్ వేశారు. ప్రయాణాల్లో మోసాలు చేస్తున్న ఆటోడ్రైవర్లకు షాక్ ఇచ్చారు. ప్రత్యేక డ్రైవ్ ద్వార ఒకేసారి వేలాది ఆటోలపై జరిమానాలు విధించి డ్రైవర్లకు ఖంగుతినిపించారు.

ప్రయాణికుల్లా ఆటోల్లో పోలీసులు
మహనగరాల్లో ప్రయాణం ఒక ప్రహాసనం లాంటిదే... స్వంత వాహనం లేకుండా బయటకు వెళ్లాలంటే ప్రభుత్వ రావాణా వ్వవస్థ ప్రధాన అధారం.. అయితే అనుకున్న చోటుకు ప్రభుత్వ రవాణా వ్యవస్థ లేకపోవడంతో అందుకోసం కేవలం ఆటోలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆటోల ఆగడాలు ఎక్కువవడంతో బెంగళూరు పోలీసులు రంగంలోకి దిగారు. మోసాలకు పాల్పడుతున్న ఆటోడ్రైవర్లను రెడ్ హ్యండెడ్ గా పట్టుకునేందుకు ప్రయాణికులుగా రంగప్రవేశం చేశారు.

5000 వేల ఆటోలపై దాడులు
నగరంలోని ప్రజల ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న సుమారు 5200 ఆటో డ్రైవర్లను రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. వారిపై జరిమాన విధించారు. ఇందుకోసం ప్రయాణికుల్లా ఆటోలో ప్రయాణించారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రయాణిస్తూ... నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్ల నుండి సుమారు 8 లక్షల రూపాయల జరిమానాను వసూలు చేశారు. ఇక గత సెప్టెంబర్‌లో కూడా ఇలాంటి ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన బెంగళూరు పోలీసులు 6800 కేసులను నమోదు చేసి , రూ. 72 లక్షలను జరిమానాగా వసూలు చేశారు.

నిబంధనలు ఉల్లంఘించిన ఆటోలు
ముఖ్యంగా యూనిఫాం ధరించకపోవడం, సరియైన పత్రాలు లేకపోవడంతోపాటు, కొన్ని ఏరియాలకు వెళ్లడానికి నిరాకరించడం, ఎక్కువ ఛార్జీలు డిమాండ్ చేయడం, మీటర్ చార్జీల కంటే ఎక్కువ వసూలు లాంటి ఆరోపణలపై పలువురు ఆటో డ్రైవర్లు బుక్ అయ్యారు. పది మంది ఆటో డ్రైవర్లలో ఇద్దరు మాత్రమే మీటర్‌పై 4-5 కిలోమీటర్ల దూరానికి వెళ్లడానికి అంగీకరించనట్టు ప్రత్యేక డ్రైవ్‌లో తేలిందని పోలీసులు తెలిపారు. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన ఆటోలపై భారీ జరిమానా విధించారు. కొన్ని ఆటోలను కూడ సీజ్ చేశారు.












Click it and Unblock the Notifications