• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దాడి చేశామని చెప్పారో అంతే : బాధితులపై గోరక్షకులు హుకుం, నోరువిప్పని వైనం, ఎంపీలో ఘటన

|

భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో గో రక్షకుల దురాగతం బయటపడింది. ఈ నెల 22న ఇద్దరు ముస్లింలు, ఓ మహిళపై గోరక్షకులు దాడికి తెగబడ్డారు. బీఫ్ తరలిస్తున్నారనే అనుమానంతో కర్రలతో దాడికి తెగబడ్డారు. వారితో ఉన్న మహిళపై కూడా విరుచుకుపడ్డారు. వీరిపై దాడికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. కానీ తమను గోరక్షకులు దాడి చేశారని బాధితులు పోలీసులకు లిఖితపూర్వకంగా చెప్పకపోవడం గమనార్షం.

ఇలా వెలుగులోకి ..

ఇలా వెలుగులోకి ..

ఈ నెల 22న శుభం బెగాల్ అనే గోరక్షలు టీం ముగ్గురిపై దాడిచేసింది. దీనికి సంబంధించి ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యింది. దాని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ బాధితులు మాత్రం లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తమ పేర్లను బయటపెడితే చంపేస్తామని శుభం అండ్ కో వారిని బెదిరించారు. దీంతో ప్రాణభయంతో గో రక్షకుల పేర్లను పోలీసులకు తెలియజేయలేదు. ఈ విషయం నిన్న కోర్టులో బాధితులు తెలుపడంతో బయటపడింది.

పోలీసులకు చెప్పలేదు ..

పోలీసులకు చెప్పలేదు ..

బాధితులపై మే 22న దాడి జరుగగా .. రెండురోజుల తర్వాత వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితులను పిలిపించి వివరాలు అడిగితే చెప్పారు కానీ .. దాడి చేసిన వారి వివరాలు తెలియజేయలేదని దుండసోని పీఎస్ అధికారి గన్ పాత్ ఉకీ పేర్కొన్నారు. గో మాంసం తరలించారనే అభియాగంతో తౌసిఫ్ ఖాన్, అంజుమ్ సామా, దిలీప్ మాద్విపై 'యాంటీ గో రక్ష యాక్ట్‘ కింద కేసు నమోదు చేసినట్టు వివరించారు.

శ్రీరాం సేన నేత ఇలా ?

శ్రీరాం సేన నేత ఇలా ?

శుభం బెగాల్ సియోని జిల్లాలో శ్రీరాం సేన అధ్యక్షుడు, అతనితోపాటు మరో నలుగురు అంజుమన్ బృందంపై దాడి చేశారు. వీరిని ఈ నెల 24న అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. కారులో పారిపోతుండగా జబల్ పూర్ వద్ద అరెస్ట్ చేసినట్టు వివరించారు. అంతేకాదు గో మాంసం సరఫరా చేశారనే అభియోగం ఎదుర్కొంటున్న మరొకరిని కూడా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. ఇందులో మరికొంతమంది ప్రమేయం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. బాధితులపై దాడి తర్వాత ... గాయాలకు సంబంధించి వైద్య పరీక్షలను చేయించారు పోలీసులు.

సస్పెన్షన్

సస్పెన్షన్

గోరక్షకులపై దాడిని శ్రీరామసేన తీవ్రంగానే పరిగణించింది. ఏప్రిల్ 28 నుంచి బెగల్ తమతో టచ్ లో లేరని పేర్కొంది. కానీ తమ సంస్థకు చెడ్డపేరు తీసుకొచ్చేవారిని ఉపేక్షించబోమని శ్రీరామసేన జాతీయ ఉపాధ్యక్షుడు ఆకాశ్ స్పష్టంచేశారు. సంస్థలో ఉంటూ నేరప్రవృతి కలిగి ఉండటాన్ని సహించబోమని స్పస్టంచేశారు. బెగల్‌ను శ్రీరాం సేన నుంచి తప్పిస్తున్నట్టు స్పష్టంచేశారు. ఇప్పటికే దానికి సంబంధించి లేఖ జారీచేశామని తేల్చిచెప్పారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TWO MEN, including a Muslim, who were beaten up on the suspicion of carrying beef and a Muslim woman accompanying them who was made to chant Jai Shri Ram, in Seoni district on May 22, told a court that they did not tell police about the torture, because the gau rakshaks had threatened to kill them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more