Elephants: తమిళనాడులో దారుణం.. కరెంట్ షాక్‍తో ఏనుగుల మృతి..
వ్యవసాయ పొలానికి వేసిన విద్యుత్ కంచె వల్ల మూడు ఏనుగులు మృతి చెందాయి.
తమిళనాడులోని ధర్మపురి జిల్లా, పాలకోడు తాలూకా శంకరాపురంలో దారుణం జరిగింది. సోమవారం వ్యవసాయ పొలానికి వేసిన విద్యుత్ కంచె వల్ల మూడు ఏనుగులు మృతి చెందాయి. విద్యత్ షాక్ అవి మృతి చెందినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. మారండహళ్లి సమీపంలోని కలిగౌండర్ కోటాయి ప్రాంతం పక్కనే ఉన్న అతిముడ్లు-శంకరాపురంలో నివాసం ఉంటాడు. అతను బెంగళూరులో నివసిస్తున్నాడు. అతనికి 22 ఎకరాల కొబ్బరి తోట ఉంది. ఈ ప్లాంటేషన్‌తోపాటు వ్యవసాయ భూమిని బాలకోడు తాలూకా కెండేనహళ్లి బీహక్కోట్టై కూలియప్ప కౌంటర్ కుమారుడు మురుగేషన్ కౌలుకు తీసుకున్నాడు.
తమిళనాడు రాష్ట్రం ధర్మపురి బాలాకోట్ సమీపంలో విద్యుత్ కంచెలో చిక్కుకుని మూడు ఆడ ఏనుగులు మృతి..!!#Tamilnadu #TamilnaduNews #Elephants #Oneindiatelugu pic.twitter.com/2qX1dwZcKX
— oneindiatelugu (@oneindiatelugu) March 7, 2023
అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్నందున పంటలను అడవి పందుల నుంచి రక్షించేందుకు వ్యవసాయ భూమి చుట్టూ విద్యుత్ కంచె ఏర్పాటు చేశాడు. అయితే సోమవారం రాత్రి 10:15 గంటల సమయంలో మూడు ఆడ ఏనుగులు అటుగా వచ్చాయి. విద్యుత్ తీగ తగలడంతో అక్కడికక్కడే కన్నుమూశాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది ఘటన స్థలికి చేరుకుని చనిపోయిన ఏనుగులను పరిశీలించారు.

కొన్ని వారాల క్రితం, కావేరి ఉత్తర వన్యప్రాణుల అభయారణ్యంలోని పొరుగున ఉన్న కృష్ణగిరి జిల్లాలోని డెంకనికోట్టైలో ఒక ఏనుగు కూడా ఇదే విధంగా అక్రమ కంచె ద్వారా విద్యుదాఘాతానికి గురైంది. అటవీ శాఖకు సమాచారం అందే వరకు ఏనుగు మృతదేహాన్ని కూడా రైతు రహస్యంగా పాతిపెట్టాడు.












Click it and Unblock the Notifications