చెన్నై - దుబాయ్ విమాన సర్వీసులు రద్దు
చెన్నై: కేరళలోని తిరువనంతపురం నుంచి వెళ్లిన ఎమిరేట్స్ విమానం బుధవారం దుబాయ్ విమానాశ్రయంలో క్రాష్ ల్యాండ్ అయిన నేపథ్యంలో గురువారం చెన్నై నుంచి దుబాయ్ మార్గంలో విమాన సర్వీసులు అన్ని రద్దు చేశారు.
బుధవారం దుబాయ్ విమానాశ్రయంలో జరిగిన క్రాష్ ల్యాండ్ కారణంగా దాదాపు 300 మంది అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి సురక్షితంగా తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. ఈ నేపథ్యంలో అధికారులు విమాన సర్వీసులు రద్దు చేశారు.

గురువారం జెట్ఎయిర్ వేస్, ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన రెండు విమానాలు చెన్నై- దుబాయ్ మార్గంలో ప్రయాణించవలసి ఉందని. అయితే ఆ విమాన సర్వీసులు రద్దు చేశామని చెన్నై విమానాశ్రయ అధికారులు తెలిపారు.
అలాగే స్పైస్ జెట్ కూడా ఈ మార్గంలో విమాన సర్వీసులు రద్దు చేశామని ఆ సంస్థ అధికారులు తెలిపారు. విమానాల రద్దు కారణంగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమించాలని ఆయా విమాన సంస్థలు సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
బుధవారం దుబాయ్ విమానాశ్రయంలో దుబాయ్ ఎమిరేట్స్ విమానం రన్ వేపై క్రాష్ ల్యాండ్ అయ్యింది. ప్రయాణికులు సురక్షితంగా కిందకు దిగిన క్షణాల్లో విమానం పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. ఆ కారణంగా గురువారం పలు విమాన సర్వీసులు రద్దు చేశారు.












Click it and Unblock the Notifications