బెంగళూరు ఏరో ఇండియా షోకు రఫేల్ యుద్ధ విమానాలు, నేటి నుంచి వైమానిక విన్యాసాలు, రెఢీ!

బెంగళూరు: బెంగళూరులో గురువారం నుంచి జరిగే ఏరో ఇండియా షోలో వైమానిక విన్యాసాలు నగర ప్రజలను ఆకట్టుకోవడానికి సర్వం సిద్దం అయ్యింది. బెంగళూరు-బళ్లారి రోడ్డులోని యలహంక వాయుసేన కేంద్రం (ఎయిర్ బేస్)లో వైమానిక విన్యాసాలు జరగనున్నాయి.

భారతదేశంలో హాట్ టాఫిగా నిలిచిన రఫేల్ యుద్ద విమానాలు యలహంక చేరుకున్నాయి. ఫ్రాన్స్ చెందిన డోసాల్ట్ కంపెనీకి చెందిన మూడు రఫేల్ యుద్ద విమానాలు యలహంక చేరుకున్నాయి. ఫిబ్రవరి 21వ తేదీ డ్రోన్ ఒలంపిక్ నిర్వహించనున్నారు.

Three Rafale aircraft arrived in Bengaluru to participate in Aero India 2019

డ్రోన్ ఒలంపిక్ లో భారతదేశంతో పాటు విదేశీ కంపెనీలు పాల్గొంటాయి. మూడు విభాగలలో పోటీలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాథమిక పోటీలు ఫిబ్రవరి 18, 19వ తేదీలో జక్కూరు ఏరోడ్రమ్ లో జరుగుతాయి. అంతిమంగా జరిగే పోటీలు ఫిబ్రవరి 21వ తేదీ యలహంక వాయుసేన కేంద్రంలో నిర్వహిస్తారు.

ఫిబ్రవరి 21వ తేదీ ఉదయం 10 గంటల నుంచి పోటీలు నిర్వహిస్తారు. పోటీలల్లో పాల్గొనడానికి మొత్తం 121 అర్జీలు రావడంతో 57 మంది అర్జీదారులు పోటీలలో పాల్గొనడానికి అర్హత పొందారు. బెంగళూరు ప్రజలను ఏరో ఇండియా షోతో ఆకట్టుకోవడానికి దేశ విదేశాలు నుంచి అనేక వివమానాలు యలహంక చేరుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+