ఏడాదిగా విద్యార్థినిపై ముగ్గురు టీచర్ల గ్యాంగ్ రేప్
థానే: ఓ పాఠశాల విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పుడుతున్న ముగ్గురు ఉపాధ్యాయులను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసి పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. విద్యార్థిని పట్ల రాక్షసులైన ఆ ముగ్గురిని ఉరి తియ్యాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
పోలీసు అధికారుల కథనం మేరకు మహారాష్ట్రలోని థానే జిల్లా భాయిదర్ పట్టణంలోని ఓ పాఠశాలలో 9 సంవత్సరాల బాలిక నాలుగవ తరగతి చదువుతున్నదని. ఇదే స్కూల్ లో నిలేశ్ భోయిర్ (47), సంజయ్ పాటిల్ (47), జితేంద్ర జాద్ (23) అనే ముగ్గురు టీచర్లుగా ఉద్యోగం చేస్తున్నారు.
ఈ ముగ్గురు బాలిక మీద కన్ను వేశారు. పాఠాలు చెప్పడానికి వెళ్లిన సమయంలో బాలికతో అసభ్యంగా మాట్లాడేవారు. ఆమె వైపు చూస్తు సైగలు చేసేవారు. పాఠశాల గదిలో ఎవ్వరూ లేని సమయంలో వేధించారు. తరువాత బాలికను స్టాఫ్ రూంలోకి తీసుకు వెళుతున్నారు.

తరువాత బాలికను లైంగికంగా వేదిస్తూ పలు సార్లు సామూహిక అత్యాచారం చేశారు. విషయం బయటకు చెబితే చంపేస్తామని బాలికను హెచ్చరించారు. గత సంవత్సరం నుంచి ముగ్గురు టీచర్లు బాలిక మీద లైంగిక దాడి చేస్తూనే ఉన్నారు.
అయితే ఆ బాలిక విషయం బయటకు చెబితే చంపేస్తారని భయపడింది. చివరికి ఆమె ఆరోగ్యంలో వ్యత్యాసం రావడంతో కుటుంబ సభ్యులు ప్రశ్నించడంతో ఆ బాలిక జరిగిన విషయం మొత్తం చెప్పింది. పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. బాలికను వైద్య పరిక్షలకు తరలించామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications