ముగ్గురు భార్యలకు 'తలాక్', నాలుగో పెళ్ళికి సిద్దమైన భర్తకు షాకిచ్చిన భార్యలు

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో: ట్రిపుల్ తలాక్ పై ముమ్మరంగా చర్చసాగుతున్న తరుణంలో మరో ఉదంతం వెలుుగుచూసింది. అయితే ముగ్గురు భార్యలకు ట్రిపుల్ తలాక్ చెప్పి నాలుగో పెళ్ళి చేసుకోవాలని ఆశపడిన భర్తకు ముగ్గురు భార్యలు కలిసి షాకిచ్చారు.

ముగ్గురు భార్యలకు ట్రిపుల్ తలాక్ చెప్పి నాలుగో పెళ్ళికి సిద్దమైన భర్తకు భార్యలు తగిన బుద్ది చెప్పారు. బహ్రయిద్ ప్రాంతానికి చెందిన దనీష్ 2013 లో మొదటి వివాహం చేసుకొన్నాడు. ఆమెతో విభేదాలు తలెత్తడంతో బెదిరింపులకు పాల్పడ్డాడు.

ఆమె ఆశ్లీలచిత్రాలు తన వద్ద ఉన్నాయంటూ పుట్టింటివారిని వేధించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు.అనంతరం ఆమెకు తలాక్ చెప్పేసి మరో పెళ్ళి చేసుకొన్నాడు.

Three wives get together to stop man’s fourth marriage in Uttar Pradesh

ఆ వివాహబంధం కూడ ఏడాది మాత్రమే ఉంది. ఇదే సమయంలో రెండో భార్య బంధువుల అమ్మాయిపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఆమె ఆశ్లీల చిత్రాలు కూడ తనవద్ద ఉన్నాయన్నారు.

పెళ్ళికి అడ్డుపడితే వాటిని బయటపెడతానని ఆమె కుటుంబసభ్యులను బెదిరించి ఆ ఆమ్మాయిని మూడో భార్యగా చేసుకొన్నాడు. అంతేకాదు నాలుగో పెళ్ళికి సిద్దమయ్యాడు. ముగ్గురు భార్యలు రెండు రోజుల క్రితం అడిషనల్ సూపరింటెండ్ దినేష్ త్రిపాఠీని కలిసి తాము పడ్డ అవస్థలను ఆయనకు వివరించారు.దీనిపై స్పందించిన పోలీసులు దినేష్ పై వివిద సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A man’s plan to marry for the fourth time hit a hurdle after his previous three wives divorced through triple talaq approached police, accusing him of making their obscene MMS and raping a minor.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి