• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చైనా బలగాలను తరిమేదెప్పుడు? - మోదీ సందేశంపై రాహుల్ సెటైర్లు

|

అన్ లాక్ సడలింపులు పెరిగే కొద్దీ దేశమంతటా కరోనా మహమ్మారిపై నిర్లక్ష్యవైఖరి గోచరిస్తున్నదని, కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేదాకా వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, ప్రధానంగా పెద్ద పడుగల వేళ మరింత అప్రమత్తంగా, బాధ్యతతో మెలగాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ మేరకు కీలక సూచనలు చేశారు. కాగా

కరోనా విలయంపై ప్రధాని మోదీ - లాక్‌డౌన్ ముగిసినా వైరస్ చావలేదు - అమెరికా కంటే మనమే బెటర్

మోదీ సందేశానికి కొద్ది నిమిషాల ముందు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అనూహ్య ప్రశ్నలు సంధించారు. జాతికి ఇవ్వబోయే సందేశంలో.. చైనా బలగాలను భారత్ నుంచి ఎప్పటికి తరిమి కొడతారో, ఆ తేదీని మోదీ చెప్పగలరా? అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం తన సొంత నియోజకవర్గం వయనాడ్‌లో పర్యటిస్తోన్న రాహుల్.. కోవిడ్-19 పరిస్థితులను సమీక్షిస్తున్నారు.

 throw out Chinese:Rahul Gandhi Tweets Request To PM Modi On Address To Nation

భారత్ చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ్(ఎల్ఏసీ) వెంబడి ఆరు నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతుండటం, తొలుత గాల్వాన్ లోయలో ఘర్షణకు దిగి, 20 మంది భారత సైనికులను హతమార్చిన డ్రాగన్ బలగాలు.. గత నెలలో చుషూల్ సెక్టార్ లో గాల్లోకి కాల్పులు సైతం జరపడం తెలిసిందే. ఉద్రిక్తతల్ని నివారించేందుకు సైనిక, దౌత్య మార్గాల్లో జరిపిన చర్చలన్నీ విఫలమవుతుండటంతో చలికాలంలో సైతం యుద్ధానికి రెండు దేశాలూ సిద్ధమవుతున్నాయి.

షాకింగా? సహజమా?: పేద రాష్ట్రంలో 60శాతం క్యాండిడేట్లు కోటీశ్వరులే - అతిపేద అభ్యర్థి ఆస్తి రూ.3వేలు

  PM Modi Cautions Nation: No Laxity Till Vaccine Is Developed | Oneindia Telugu

  మరోవైపు, చైనా ఆటలు కట్టించే క్రమంలో అంతర్జాతీయంగా భారత్ సరికొత్త వ్యూహాలను రచిస్తున్నది. ఇండో-పసిఫిక్ రీజియన్ లో పట్టుకోసం ప్రయత్నిస్తోన్న చైనాకు చెక్ పెట్టేలా ప్రతిష్టాత్మక 'మలబార్ విన్యాసాల' ప్రక్రియలో ఈసారి ఆస్ట్రేలియా సైతం పాల్గొనేలా భారత్ మంత్రాంగం నెరపింది. ఇప్పటికే ఈ విన్యాసాల్లో భారత్, అమెరికా, జపాన్ నౌకాదళాలు భాగం పంచుకుంటుండగా, ఇప్పుడు ఆసీస్ వచ్చి చేరింది.

  English summary
  Congress MP Rahul Gandhi tweeted a request to Prime Minister Narendra Modi just before his address to the nation on Tuesday, saying he must tell the country the date by which he will "throw the Chinese out of Indian territory". "Dear PM, in your 6 pm address, please tell the nation the date by which you will throw the Chinese out of Indian territory. Thank you," he tweeted.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X