శశికళ వస్తే అన్నాడీఎంకే అంతం చూస్తారు: తుగ్గక్ !
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వారసురాలిగా నెచ్చెలి శశికళను నియమిస్తే మీ నెత్తిన మీరే రాయివేసుకుంటారని చో రామస్వామికి చెందిన తగ్లక్ పత్రిక అన్నాడీఎంకే నాయకులను హెచ్చరించింది.
జయలలితకు నిజమైన వారసులు ఎవరో ? మీరే చెప్పడం మంచిది కాదని, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోవాలని తుగ్లక్ పత్రిక సూచించింది. తగ్లక్ పత్రిక వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు, న్యాయవాది, రచయిత అయిన చోరామస్వామి అంటే జయలలితకు ఎంతో గౌరవం.

జయలలిత మరణించేంత వరకు ప్రతి పుట్టిన రోజు సందర్బంగా చో రామస్వామి నుంచి జయలలిత ఆశీర్వాదం తీసుకున్న విషయం తెలిసిందే. జయలలిత ఎన్నో విషయాలు చో రామస్వామికి చెప్పారు.
జయలలిత, చో రామస్వామి మరణించిన తరువాత విడుదల అయిన తుగ్లక్ పత్రికలో ఓ వ్యాసం ప్రచురితం అయ్యింది. అందులో శశికళ రాజకీయాల్లో రావడంతో తనకు ఏమాత్రం ఇష్టం లేదనే విషయం జయలలిత ఒక సారి చో రామస్వామికి చెప్పారంట.
అదే విషయం చో రామస్వామి తుగ్లక్ పత్రిక సిబ్బందితో గతంలో చెప్పారు. అంతే కాకుండా ఆ విషయాలను చో రామస్వామి తన డైరీలో రాశారని తుగ్లక్ పత్రిక ప్రచురించింది. ఇప్పుడు ఆ వివరాలను తుగ్లక్ పత్రిక బయటపెట్టింది. ఇప్పటికైనా అన్నాడీఎంకే నాయకులు కళ్లు తెరిస్తే మంచిదని తుగ్లక్ పత్రిక అభిప్రాయం వ్యక్తం చేసింది.












Click it and Unblock the Notifications