వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

85 ఏళ్ల తర్వాత కప్‌బోర్డులో దొరికిన పులి అవశేషాలు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
టాస్మానియా టైగర్

85 ఏళ్ల కిందట తప్పిపోయినట్టు భావించిన చివరి టాస్మానియన్ టైగర్ అవశేషాలు ఆస్ట్రేలియా మ్యూజియంలోని కప్‌బోర్డులో కనిపించాయి. 1936లో హోబర్ట్ జూలో థైలాసిన్(టాస్మానియర్ టైగర్) మరణించింది. ఆ తర్వాత ఈ పులి మృతదేహాన్ని జూ వారు స్థానిక మ్యూజియానికి అప్పజెప్పారు.

కానీ ఆ తర్వాత థైలాసిన్ మృతదేహం ఏమైందో ఎవరికీ తెలియదు. దీని మృతదేహాం ప్రతి ఒక్కరికీ మిస్టరీగానే మారింది.

టాస్మానియన్ మ్యూజియం కానీ, ఆర్ట్ గ్యాలరీ కానీ దాని అవశేషాలను గుర్తించేందుకు ఎంతో ప్రయత్నించి, విఫలమయ్యాయి. ఒకవేళ ఆ పులి అవశేషాలను బయటపడేసి ఉండొచ్చని భావించాయి టాస్మానియన్ మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ.

అయితే ఇన్నేళ్లుగా ఈ పులి అవశేషాలు మ్యూజియంలోనే ఉన్నట్టు సరికొత్త పరిశోధనల్లో బయటపడింది. దీని అవశేషాలు మ్యూజియంలోనే ఉన్నప్పటికీ, సరియైన రీతిలో దీన్ని భద్రపరచలేదని సరికొత్త పరిశోధనలు తెలిపాయి.

''1936 నుంచి ఎలాంటి థైలాసిన్ బాడీ ఉన్నట్టు రికార్డుల్లో లేకపోవడంతో, ఎన్నో ఏళ్లుగా ఎంతో మంది మ్యూజియం క్యూరేటర్లు, పరిశోధకులు దీని అవశేషాల గురించి వెతికి వెతికి విఫలమయ్యారు’’ అని అంతరించిపోయిన జీవ జాతులపై 2000లో పుస్తకం ప్రచురించిన రోబర్ట్ పడ్లే తెలిపారు.

దీని బాడీని ఎక్కడో బయట పడేసినట్టు భావించారు.

కానీ తాను, మ్యూజియం క్యూరేటర్లలో ఒకరు కలిసి ప్రచురితం కాని ఒక ట్యాక్సిడెర్మిస్ట్ రిపోర్టును గుర్తించినట్టు తెలిపారు. ఈ రిపోర్టులో వీరు మ్యూజియం ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ కప్‌బోర్డులో కనిపించకుండా పోయిన ఒక ఆడజాతికి చెందిన జీవి అవశేషం ఉన్నట్టు కనుగొన్నారు.

''దీన్ని ఆస్ట్రేలియా అంతటా తిప్పుతూ ప్రదర్శించారు. కానీ దీన్ని తప్పిపోయిన థైలాసిన్ అని మ్యూజియం స్టాఫ్ గుర్తించలేకపోయారు’’ అని క్యూరేటర్ క్యాథరిన్ మెడ్‌లాక్ ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్‌కు చెప్పారు.

ప్రదర్శనకు దీన్ని ఎందుకు ఎంపిక చేసుకున్నారంటే, అవశేషాలన్నింటిల్లో దీనికే మంచి శరీరం ఉందని ఆమె అన్నారు.

హోబర్ట్‌లోని మ్యూజియంలో ఎన్నో జంతువుల శరీరాలు, అవశేషాలు ప్రదర్శనకు ఉన్నాయి.

ఆస్ట్రేలియాలో ఒకప్పుడు పెద్ద ఎత్తున ఉన్న టాస్మానియా టైగర్ల సంఖ్య.. ఆ తర్వాత మనుషులు, డింగోస్ ప్రభావంతో బాగా తగ్గిపోయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Tiger remains found in cupboard after 85 years
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X