వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్లాస్టిక్ నిషేధానికి ప్రపంచ దేశాలు ముందుకు రావాలి : నరేంద్ర మోడీ

|
Google Oneindia TeluguNews

సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధించాలన్న భారత నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి పునరుద్ఘాటించారు, "సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు ప్రపంచం కూడా వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైంది" ఆయన అన్నారు..డిల్లీలో జరిగిన ప్రపంచ వాతావరణ మార్పులు మరియు సంక్షోభం పై నిర్వహించిన సమావేశంలో ప్రధాని మాట్లాడారు. ఈనేపథ్యంలోనే మానవ సాధికారత అనేది పర్యావరణంతో ముడిపడి ఉందని చెప్పారు. దేశంలో కల్గే వాతావరణ మార్పులను ఎదుర్కోవటానికి ప్రజలు ముందుకు వచ్చి, కలిసి పనిచేయాలని మోడీ పిలుపునిచ్చారు.

కేంద్రమంత్రి కుటుంభమని వదిలేశారు... తన ఉద్యోగానికే ఎసరు తెచ్చుకున్నారు...!కేంద్రమంత్రి కుటుంభమని వదిలేశారు... తన ఉద్యోగానికే ఎసరు తెచ్చుకున్నారు...!

ఈ నేపథ్యంలోనే మహాత్మా గాంధీ జన్మదినం అయిన అక్టోబర్ 2 నాటికి ఆరు ప్లాస్టిక్ వస్తువులపై దేశవ్యాప్తంగా నిషేధం విధించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ఆరు వస్తువులలో ప్లాస్టిక్ సంచులు, కప్పులు, ప్లేట్లు, చిన్న సీసాలు, స్ట్రాస్ మరియు కొన్ని రకాల సాచెట్లు ఉన్నాయి.ప్లాస్టిక్ ఉత్పత్తులకు సంబంధించి కఠినమైన పర్యావరణ ప్రమాణాలను రూపోంచిందేకు కూడా ప్రభుత్వం యోచిస్తోందని ఆయన చెప్పారు మరియు దీంతోపాటు రీసైకిల్ చేసి ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువలను మాత్రమే ఉపయోగించేందుకు ప్రభుత్వం పలు నిబంధనలు రూపోందించిందని చెప్పారు.

Time has come for even the world to say goodbye to single-use plastic:Narendra Modi

మరోవైపు ప్లాస్టిక్ కాలుష్యం గురించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్నాయి, దీంతో పలు దేశాలు మహాసముద్రాలపై కూడ ప్రత్యేక దృష్టి సారించాయి, సముద్రాల్లో దాదాపు 50 శాతం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులు సముద్రంలో వేస్తున్నారు. దీంతో సముద్ర జీవులు చనిపోయోందుకు అవి దోహదపడుతున్నాయని సమావేశంలో పాల్గోన్న పలువురు వక్తలు తెలిపారు.ఇక ప్రపంచ దేశాల్లో యూరోపియన్ యూనియన్ 2021 నాటికి స్ట్రాస్, ఫోర్కులు, కత్తులు మరియు పత్తి మొగ్గలు వంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను నిషేధించాలని యోచిస్తున్నట్టు పలువురు వెళ్లడించారు.

English summary
Prime Minister Narendra Modi today reiterated India's decision to impose a ban on single-use plastic, declaring "time has come for even the world to say goodbye to single-use plastic". Speaking at a world climate change crisis meeting in Delhi,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X