Viral Video:ఎంత పనిచేశావ్ స్వామి.. గన్ ఇస్తే ఫైర్ చేసి మరీ, పెళ్లి బారాత్‌లో.. ఎక్కడ అంటే..?

పెళ్లి బారాత్‌లో డీజేల హోరు.. ఊరేగింపు కోసం వేడుకగా వస్తారు. అంత మంచి ఊఫులో ఉంటారు. అయితే కొన్నిసార్లు అనుకొని ఘటనలు జరుగుతుంటాయి. అవును ప్రాణాలే పోవాల్సి వస్తోంది. ఇటీవల పెళ్లి ముగిసిన తర్వాత.. కాల్పులు జరపడం అలవాటు అయిపోయింది. లైసెన్స్ గన్ తీసుకురావడం.. ఫైర్ చేయడం చకచకా జరిగిపోతున్నాయి. అయితే ఉత్తరప్రదేశ్‌లో కూడా ఇలాంటి ఘటన జరిగింది.

 గన్ తీసుకొని..

గన్ తీసుకొని..

సోన్ భద్ర జిల్లాలో ఇటీవల ఓ పెళ్లి జరిగింది. పెళ్లి కుమారుడి స్నేహితుడు బాబులాల్ యాదవ్.. ఈయన ఆర్మీ జవాన్.. ఇతని వద్ద గన్ కూడా ఉంది. అయితే పెళ్లి తంతు ముగిసిపోయింది. ఊరేగింపుగా అంతా వస్తున్నారు. ఇంకేముంది బాబులాల్.. తన తుపాకీని పెళ్లి కొడుకును ఇచ్చాడు. అతనికి కాల్చవచ్చో రాదో తెలియదు.. అటు ఇటు చూసి.. పైకి పట్టుకొని ఫైర్ చేశాడు. కానీ అదీ పేలలేదు. దానిని కిందకి తీసి చూశాడు. అంతలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అతని స్నేహితుడు రక్తపుమడుగులో ఉన్నాడు.

బుల్లెట్ తగిలి

బుల్లెట్ తగిలి


ఎందుకంటే ఫైర్ చేయగా.. బుల్లెట్ బాబులాల్‌కు వచ్చి తగిలింది. వెంటనే అతను తీవ్రంగా గాయపడ్డారు. ఆ వెంటనే చనిపోయాడు. స్నేహితుడి పెళ్లికి వచ్చి.. గన్ ఇచ్చి తిరిగిరానీ లోకాలకు వెళ్లిపోయాడు. దీంతో ఒక్కసారిగా విషాదం నెలకొంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వరుడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. దీంతో పెళ్లి కూతురు తరపు బంధువులు అయ్యో అనుకున్నారు. పెళ్లి రోజే ఇలా జరిగిందని అనుకున్నారు.

నో పర్మిషన్.. కానీ

నో పర్మిషన్.. కానీ


వాస్తవానికి పెళ్లిళ్లు జరిగేచోట, పుణ్యక్షేత్రాలు, బహిరంగ సభల్లో లైసెన్స్ ఉన్న గన్‌తో జరుపడం నిషిద్దం. కానీ తెలియక వాడుతున్నారు. తప్పు జరగడంతో కటకటాల్లో ఊచలు లెక్కబెడుతున్నారు. యూపీలో పెళ్లి కొడుకు పరిస్థితి అలానే ఉంది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. ఆ గన్ కూడా మృతుడు బాబులాల్ యాదవ్‌దే కావడం విశేషం. సరదాగా గన్ పేల్చమని ఇస్తే.. అతనిపై కాల్పులు జరిపి ప్రాణాలు తీశాడు వరుడు. అరెస్టై.. నవ వధువు దృష్టిలో నేరస్తుడిగా ఉండిపోయాడు. స్నేహితుడి ప్రాణం తీశాననే బాధ అతనికి ఎల్లకాలం ఉండనుంది. జరిగింది యాక్సిడెంటల్ అయినా.. మాయని మచ్చగా ఉండనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+