'అమిత్ షా తల నరికి టేబుల్ మీద పెట్టాలి'.. ఎంపీ వ్యాఖ్యలతో పెనుదుమారం
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. శుక్రవారం నదియా జిల్లాలో పశ్చిమ బెంగాల్‌లోకి అక్రమ వలసదారుల గురించి జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తృణమూల్ ఎంపీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
వివాదాస్పద వ్యాఖ్యలు సారాంశం
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా మాట్లాడుతూ.. "నాకు అమిత్ షాను ఒకే ఒక ప్రశ్న అడగాలని ఉంది. ఆయన పదేపదే చొరబాటుదారులు.. చొరబాటుదారులు అని అంటున్నారు. మన సరిహద్దులను కాపలా కాస్తున్న ఏజెన్సీ కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆధీనంలో ఉంది. ప్రధానమంత్రి ఆగస్టు 15న ఎర్రకోట నుంచి చొరబాట్లు జరుగుతున్నాయని, వాటివల్ల జనాభాలో మార్పులు వస్తున్నాయని చెప్పారు. ప్రధానమంత్రి ఈ మాటలు చెబుతున్నప్పుడు మొదటి వరుసలో కూర్చున్న హోంమంత్రి చిరునవ్వులు చిందిస్తూ చప్పట్లు కొడుతున్నారు' అని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా వ్యాఖ్యానించారు.

మహువా మొయిత్రా ఇంకా మాట్లాడుతూ.. "ఒకవేళ భారతదేశ సరిహద్దులను కాపాడేవారు ఎవరూ లేకుంటే, ఒకవేళ రోజుకు వందలు, వేలు, లక్షల సంఖ్యలో ఇతర దేశాల ప్రజలు చొరబడుతూ.. మన తల్లులు, సోదరీమణులపై కన్నేసి, మన భూములను లాగేసుకుంటుంటే.. అయితే ముందుగా మీరు అమిత్ షా తల నరికి టేబుల్ మీద పెట్టాలి" అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "ఒకవేళ హోంమంత్రి, హోం మంత్రిత్వ శాఖ భారతదేశ సరిహద్దులను కాపాడలేకపోతే.. ప్రధానమంత్రి స్వయంగా బయట నుంచి వచ్చి ప్రజలు మన తల్లులు, సోదరీమణులపై కన్నేసి, మన భూములను లాగేసుకుంటున్నారని చెబుతుంటే, అది ఎవరి తప్పు? మనదా, మీదా? ఇక్కడ బీఎస్ఎఫ్ ఉంది. మేము కూడా వారిని చూసి భయపడుతూ ఉంటాం. బంగ్లాదేశ్ మన మిత్రదేశం, కానీ మీ వల్ల గత కొన్ని సంవత్సరాలుగా ఈ పరిస్థితి మారిపోయింది" అని ఆమె అన్నారు.
ఆమెపై ఫిర్యాదు నమోదు
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా వ్యాఖ్యల విషయమై.. ఆమెపై నదియా జిల్లాలోని కృష్ణానగర్ పోలీస్ స్టేషన్‌లో బీజేపీ ఫిర్యాదు చేసింది. స్థానిక నివాసి సందీప్ మజుందార్ ఈ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై మహువా మొయిత్రా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాకపోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications