ఆత్మహత్య చేసుకుంటుంటే వీడియో తీశారు: మీడియాపై తృణమూల్ ఎంపీ

న్యూఢిల్లీ : ఒక రైతు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటుంటే మీడియా చక్కగా వీడియో తీసుకుంటోందని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్లమెంటు సభ్యుడు సౌగత్‌ రాయ్‌ విమర్శించారు. రైతు ఆత్మహత్యలపై గురువారం లోక్‌సభలో జరిగిన చర్చలో భాగంగా ఆయన మాట్లాడారు. ఈ ఘటన అతి పెద్ద విషాదంగా నేను భావిస్తున్నానని అన్నారు.

పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అంటున్నారని, న్యాయ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్‌ చేశారు. బుధవారంనాడు ఢిల్లీలో రాజస్థాన్‌కు చెందిన గజేంద్ర సింగ్‌ అనే రైతు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

రాజేంద్ర సింగ్ ఆత్మహత్య రెండు విషయాలను బయటపెడుతోందని, ఒకటి మనం సున్నితత్వాన్ని కోల్పోతున్న విషయం కాగా రెండోది మన రైతుల పరిస్థితి అని ఆయన అన్నారు.

 Saugata Roy

రైతు ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా ఆప్ ర్యాలీ కొనసాగడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్‌లో వ్యాఖ్యలు రాసే బదులు బయటకు వచ్చి ప్రకటన చేయాలని ఆయన అన్నారు.

శానికి రైతు వెన్నెముకలాంటివాడని చెబుతున్న మనం ఆ రైతు కష్టాల గురించి ఎంత వరకు ఆలోచిస్తున్న విషయాన్ని మనమందరం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని టీడీపీ ఎంపీ మురళీమోహన్‌ అన్నారు. రైతు ఆత్మహత్యలపై గురువారం లోక్‌సభలో జరిగిన చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికైనా స్వామినాథన్‌ కమిటీ ఇచ్చిన సూచనలు పాటించి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు.

ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు అందరి తరఫున, తెలుగు దేశం పార్టీ తరఫున నివాళులర్పిస్తున్నట్లు మురళీమోహన్‌ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+