విద్యార్థిని కొట్టి చంపిన టిఎంసి స్టూడెంట్స్... వీడియో విడుదల
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మంత్రిని సన్మానించేందుకు నిరాకరించిన షాబాంగ్ కళాశాల విద్యార్థిని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొట్టి చంపారు. ఈ సంఘటన రెండు రోజుల క్రితం జరిగింది.
ఇందుకు సంబంధించిన సిసిటీవీ వీడియో దృశ్యాలు బయటకు వచ్చాయి. కళాశాల వరండాలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న ఒక విద్యార్థిని తృణమూల్ కాంగ్రెస్ స్టూడెంట్స్ వింగ్ విద్యార్థులు కింద పడవేసి కొట్టారు.
తర్వాత క్రికెట్ బ్యాట్‌లు, ఇనుప రాడ్డ్డులతో కొట్టి అతనిని చంపేశారు. ఈ ఘటనను నిరసిస్తూ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, విద్యార్థి సంఘాలు పశ్చిమ బెంగాల్లో ఆందోళనలు నిర్వహించాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి.

మంత్రి సోమెన్ కుమార్ మహోపాత్రాను సన్మానించే విషయమై.. పశ్చిమ మిడ్నాపూర్‌లోని సబంగ్ కళాశాలలో ఈ గొడవ జరిగింది.
బిఏ మూడో ఏడాది చదువుతున్న కృష్ణ ప్రసాద్ జానా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు. అతను మంత్రిని సన్మానించేందుకు నిరాకరించడంతో టిఎంసీ విద్యార్థి నాయకులు కొట్టి చంపారు. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులను అరెస్టడు చేశారు. అయితే, ఎవర్ని అరెస్టు చేశారనే విషయం వెల్లడి కావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications