ఇదీ దెబ్బ: శ్రీలంక దళాలపై కేసు నమోదు చేసిన తమిళనాడు

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: రామేశ్వరంకు చెందిన ప్రిట్సో (21) అనే యువకుడిని కాల్చిచంపిన శ్రీలంక సేనల మీద తమిళనాడు గస్తీ తీర ప్రత్యేక దళాలు కేసు నమోదు చేశాయి. ప్రిట్సో హత్య కేసులో విచారణ జరిపి ఎఫ్ఐఆర్ నమోదు చేసి న్యాయస్థానంలో సమర్పిస్తామని అధికారులు తెలిపారు.

మార్చి 7వ తేదిన మంగళవారం రామేశ్వరంకు చెందిన 2,500 మంది జాలర్లు చేపలుపట్టడానికి వెళ్లారు. అర్దరాత్రి ధనుష్కోటి-కచ్చదీవుల మధ్యలో చేపలుపడుతున్న సమయంలో కన్ పోట్ నౌక, వాటర్ స్కూటర్లలో శ్రీలంక దళాలు తమిళ జాలర్ల పడవలను చుట్టుముట్టారు.

TN coastal security force has filed a case against Srilankan Navy who shot TN fisherman

ఆ సమయంలో విచక్షణా రహితంగా తమిళ జాలర్లపై కాల్పులు జరిపారు. ఆందోళన చెందిన జాలర్లు మరపడవల అడుగుభాగానికి చేరుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ప్రిట్సో గొంతులోకి, పడవ నడుపుతున్న సరోన్ (22) అనే యువకుడి శరీరంలోకి తూటాలు దూసుకు వెళ్లాయి.

వెంటనే వారిని రామేశ్వరంలోని ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో ప్రిట్సో మరణించాడు. వైద్యులు ప్రిట్సో శరీరం నుంచి ఏకే-47 తుపాకి బుల్లెట్ బయటకు తీశారు. ఐదు రోజుల పాటు ప్రిట్సో మృతదేహం తీసుకోకుండా శ్రీలంక సేనల మీద కఠిన చర్యలు తీసుకోవాలని జాలర్లు ఆందోళన చేశారు. చివరికి శ్రీలంక దళాల మీద కేసు నమోదు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tamil Nadu coastal security force has filed a case against Srilankan Navy who shot TN fisherman Bridjo before 15 days back.
Please Wait while comments are loading...