జయలలిత మృతదేహంలోకి ఐదున్నర లీటర్ల రసాయనాలు: డాక్టర్ సుధా సాక్ష్యం!

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనుమానాస్పద మృతిపై విచారణ చేస్తున్న మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ఆ రాష్ట్ర ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ సుధా శేషయ్యన్ ను విచారించి వివరాలు సేకరించి రికార్డు చేసుకున్నారు.

డాక్టర్ సుధా శేషయ్యన్

డాక్టర్ సుధా శేషయ్యన్

జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ముందు హాజరైన తమిళనాడు ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ సుధా శేషయ్యన్ జయలలిత మృతదేహం చెడిపోకుండా ఐదున్నర లీటర్ల రసాయనాలు ఎక్కించామని సాక్షం చెప్పారు.

  Jayalalitha Hospital Footage Exclusive జయలలిత అపోలో ఆసుపత్రి వీడియో విడుదల
   ఎంఎంసీ

  ఎంఎంసీ

  మద్రాసు మెడికల్‌ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్, ఎంఎంసి అనాటమీ విభాగం చీఫ్‌ డాక్టర్‌ సుధా శేషయ్యన్‌ జయలలిత మృతదేహానికి ఎంబ్లామింగ్‌ జరిపారు. జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ముందు హాజరైన డాక్టర్ సుధా శేషయ్యన్ సాక్షం చెప్పారు.

  అమ్మకు సన్నిహితురాలు

  అమ్మకు సన్నిహితురాలు

  డాక్టర్ సుధా శేషయ్యన్ తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితురాలు. జయలలిత మరణించిన తరువాత డాక్టర్ సుధా శేషయ్యన్ జయలలిత మృతదేహానికి ఎంబ్లామింగ్‌ జరిపారని తెలుసుకున్న జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ విచారణకు హాజరు కావాలని ఆమెకు సమన్లు జారీ చేశారు.

  అపోలో ఆసుపత్రి!

  అపోలో ఆసుపత్రి!

  2016 సెప్టెంబర్ 22వ తేదీ అర్దరాత్రి నుంచి డిసెంబర్ 5వ తేదీ రాత్రి వరకూ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో జయలలితకు చికిత్స చేసిన విషయం తెలిసిందే. చికిత్స విఫలమై డిసెంబర్ 5వ తేదీ రాత్రి పొద్దుపోయిన తరువాత జయలలిత మరణించారని అపోలో ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.

  రాత్రి 10 గంటలకు!

  రాత్రి 10 గంటలకు!

  డిసెంబర్ 5వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో అపోలో ఆసుపత్రి నుంచి తనకు ఫోన్ వచ్చిందని డాక్టర్ సుధా శేషయ్యన్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ముందు వివరణ ఇచ్చారు. జయలలిత మరణించారని, ఆమె మృతదేహం చెడిపోకుండా ఎంబ్లామింగ్‌ చెయ్యాలని చెప్పారని సుధా శేషయ్యన్ సాక్షం చెప్పారు.

   రసాయనాలు!

  రసాయనాలు!

  తన వైద్య బృందంతో అపోలో ఆసుపత్రికి వెళ్లి జయలలిత మృతదేహం చెడిపోకుండా మరుసటి రోజు ప్రజలు అమ్మను సందర్శించడానికి రసాయనిక మిశ్రమాలను ఉపయోగించామని డాక్టర్ సుధా శేషయ్యన్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ముందు అంగీకరించారు.

   దవడ మీద చుక్కలు

  దవడ మీద చుక్కలు

  ఎంబ్లామింగ్‌ కోసమే జయలలిత ఎడమవైపు దవడ మీద నాలుగు రంధ్రాలు వేశామని డాక్టర్ సుధా శేషయ్యన్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ కు చెప్పారు. మెథనాల్‌తో సహా వివిధ రసాయనాలు కలిగిన ఐదున్నర లీటర్ల మిశ్రమాన్ని ఇంజెక్షన్ల ద్వారా జయలలిత మృతదేహంలోని రక్త నాళాలకు ఎక్కించామని డాక్టర్ సుధా శేషయ్యన్ జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ముందు సాక్షం చెప్పారు.

   అపోలోకు అందుకే?

  అపోలోకు అందుకే?

  జయలలితకు అందించిన చికిత్స వివరాలు ఉన్న పూర్తి వైద్య చికిత్సల రికార్డులు జనవరి 12వ తేదీ లోపు తమకు సమర్పించాలని జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ అపోలో ఆసుపత్రి యాజమాన్యానికి సూచించింది.

   ప్రభుత్వ వైద్యుల వివరణ!

  ప్రభుత్వ వైద్యుల వివరణ!

  ప్రభుత్వ వైద్యుల దగ్గర వివరణ తీసుకున్న తరువాత ఇప్పుడు అపోలో ఆసుపత్రి యాజమాన్యం, వైద్యులను విచారణ చెయ్యాలని జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ నిర్ణయించింది. మొత్తం మీద జయలలిత మరణంపై వచ్చిన అనుమానాలకు ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం బయటకు వస్తోంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Dr Sudha Seshaiyan, vice principal of Madras Medical College, appeared before the Arumughaswamy Commission of Inquiry here in response to summons issued by it to her recently. Later, she told reporters that she apprised the panel of the embalming procedure that was done for Jayalalithaa.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి