వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్ కే నగర్ సర్వే: టీవీ చానల్ బంద్: అగ్రస్థానంలో ఆయనే: దినకరన్ ఢమాల్ !

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో ప్రజలు ఎవరి వైపు ఉన్నారని పుతై తలైమురై టీవీ చానల్ సర్వే నిర్వహించి విడుదల చేసింది. దినకరన్ మూడవ స్థానంలో ఉన్నారని సర్వే విడుదల చెయ్యడంతో తమిళనాడు ప్రభుత్వం ఆ టీవీ చానల్ ప్రస

|
Google Oneindia TeluguNews

న్నై: తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ శశికళ వర్గం తమకు వ్యతిరేకంగా వార్తలు, సర్వేలు ప్రసారాలు చేస్తున్న మీడియా మీద విరుచుకుపడుతున్నారు. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీటీవీ దినకరన్ ఓడిపోతారని ఓ టీవీ చానల్ సర్వే విడుదల చెయ్యడంతో కేబుల్ ప్రసారాలు కట్ చేశారు.

తమిళనాడులో ప్రసిద్ది చెందిన ఎస్ఆర్ ఎం గ్రూప్ కు అనేక విద్యాసంస్థలు, ట్రావెల్స్, వ్యాపారాలు ఉన్నాయి. ఈ సంస్థ పుతై తలైమురై టీవీ చానల్ నిర్వహిస్తోంది. ఆర్ కే నగర్ ఉప ఎన్నిల్లో గెలిచే అవకాశం ఎవ్వరికి ఉంది అంటూ ఈ టీవీ చానల్ సర్వే నిర్వహించింది.

TN Govt has cut the Puthiya Talaimurai channel in Govt Arasu Cable channel

<strong>ఆరోగ్య శాఖా మంత్రికి షాక్: అనుచరుడి ఇంట్లో రూ. కోట్లు సీజ్ !</strong>ఆరోగ్య శాఖా మంత్రికి షాక్: అనుచరుడి ఇంట్లో రూ. కోట్లు సీజ్ !

ఆర్ కే నగర్ నియోజక వర్గం ఓటర్ల అభిప్రాయాలు సేకరించి శుక్రవారం రాత్రి సర్వే విడుదల చేసింది. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న పన్నీర్ సెల్వం గ్రూప్ లోని మధుసూదనన్ వైపు ఆర్ కే నగర్ నియోజక వర్గ ప్రజలు ఉన్నారని వెలుగు చూసింది.

ఆర్ కే నగర్ లో మధుసూదనన్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పుతై తలైమురై టీవీ సర్వే విడుదల చేసింది. రెండవ స్థానంలో డీఎంకే, మూడవ స్థానంలో టీటీవీ దినకరన్, నాలుగవ స్థానంలో బీజేపీ, ఐదవ స్థానంలో జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఉన్నారని సర్వే విడుదల చేసింది.

<strong>ఆర్ కే నగర్ లో రూ. 80 కోట్లు పంచేశారు: మొత్తం లెక్కలేస్తే, ఆ వీడియోనే !</strong>ఆర్ కే నగర్ లో రూ. 80 కోట్లు పంచేశారు: మొత్తం లెక్కలేస్తే, ఆ వీడియోనే !

దినకరన్ కు మూడవ స్థానంలో ఉన్నారని చూపించిన పుతై తలైమురై టీవీ చానల్ మీద తమిళనాడు ప్రభుత్వ అరసు కేబుల్ విరుచుకుపడింది. శనివారం నుంచి ఆ టీవీ చానల్ ప్రసారాలను తమిళనాడు ప్రభుత్వం నిలిపివేసింది.

ఇదే సర్వేలో విజయ్ కాంత్ కు చెందిన అభ్యర్థి చివరి స్థానంలో ఉన్నాడని వెలుగు చూసింది. ప్రజల అభిప్రాయాలు సేకరించి సర్వే నిర్వహించిన టీవీ చానల్ మీద దినకరన్ పగ తీర్చుకోవడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చి పుతై తలైమురై టీవీ చానల్ ప్రసారాలు నిలిపివేశారని విమర్శలు వెల్లువెత్తాయి.

English summary
Tamil Nadu Govt has cut the Puthiya Talaimurai channel in Govt Arasu Cable channel after it aired a survey on RK Nagar by election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X