చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కమల్ హాసన్, కేజ్రీవాల్ మీటింగ్: ట్రంప్ తో భేటీ అయినా మాకు నష్టం లేదు: మంత్రి, తిరగలేవు !

సీఎం కేజ్రీవాల్ తో కాదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో కలిసినా నష్టం లేదుహీరో కమల్ హాసన్ పై తమిళనాడు మంత్రి జయకుమార్ విసుర్లు, విషయాన్ని పెద్దది చేశారుప్రజల్లో తిరగకుండా చేస్తామని కమల్ అభిమానుల హెచ్చర

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు మంత్రులు కావాలనే బహుబాష నటుడు కమల్ హాసన్ ను టార్గెట్ చేసుకుంటున్నారా అంటే అవుననే అంటున్నారు ఆయన అభిమానులు. తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని కమల్ హాసన్ రెండు నెలల క్రితం ఓ ఇంటర్వూలో చెప్పారు.

కమల్ హాసన్, కేజ్రీవాల్ భేటీ: మీడియాకు అసలు విషయం చెప్పిన హీరో, సీఎం, అభిమాని !కమల్ హాసన్, కేజ్రీవాల్ భేటీ: మీడియాకు అసలు విషయం చెప్పిన హీరో, సీఎం, అభిమాని !

అప్పటి నుంచి కమల్ హాసన్ ను టార్గెట్ చేసుకుని తమిళనాడు మంత్రులు కొందరు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెన్నై చేరుకుని కమల్ హాసన్ తో భేటీ అయిన సమయంలో తమిళనాడు మంత్రి జయకుమార్ మళ్లీ తన నోటికి పని చెప్పాడు.

TN Minister Jayakumar jibes Actor Kamalhaasan and Arvind Kejriwal meeting

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వచ్చి కమల్ హాసన్ ను కలిసినా మాకు ఎలాంటి ఇబ్బంది లేదని వ్యంగంగా అన్నారు. కమల్ హాసన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయినా మా ప్రభుత్వానికి, అన్నాడీఎంకే పార్టీకి ఎలాంటి నష్టం లేదని ఎద్దెవ చేశారు. మంత్రి జయకుమార్ వ్యాఖ్యలపై కమల్ హాసన్ అభిమానులు మండిపడుతున్నారు.

కమల్ హాసన్ ఇంటికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్: రాజకీయాలు టార్గెట్, ఆప్ లోకి కమల్!కమల్ హాసన్ ఇంటికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్: రాజకీయాలు టార్గెట్, ఆప్ లోకి కమల్!

మా అభిమాన నాయకుడితో ఒక సీఎం భేటీ అయితే దానిని రాజకీయం చేస్తూ మంత్రి జయకుమార్ ఉద్దరగా మీడియాలో ప్రచారం పొందుతున్నారని విమర్శించారు. మా అభిమాన నాయకుడి మీద విమర్శలు చెయ్యడం మానుకోవాలని, లేదంటే ప్రజల్లో తిరుగకుండా చేస్తామని మంత్రి జయకుమార్ ను కమల్ అభిమానులు హెచ్చరించారు.

English summary
Tamil Nadu Fisheries department Minister Jayakumar jibes Actor Kamal Haasan and Delhi CM Arvind Kejriwal's meeting and says they dont worry even if kamal meet US President Trumph.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X