వెంటనే మంత్రి పదవులకు రాజీనామా చెయ్యండి: టీటీవీ దినకరన్ వర్గం సవాల్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: అన్నాడీఎంకే పార్టీలో రోజురోజుకు వర్గ పోరు పెరిగిపోతుంది. తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే (అమ్మ) వర్గం మీద టీటీవీ దినకరన్ గ్రూప్ లో ఉన్న నాయకులు మండిపడుతున్నారు. మీకు దమ్ముంటే వెంటనే మంత్రి పదవులకు రాజీనామా చెయ్యాలని సవాలు చేశారు.

అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యే తంగ తమిళ సెల్వన్ మొదటి నుంచి టీటీవీ దినకరన్ వర్గీయుడిగా గుర్తింపుపొందాడు. ఇటీవల తమిళనాడు మంత్రులు జయకుమార్, దిండుగల్ శ్రీనివాస్ వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ టీటీవీ దినకరన్ ను పార్టీ నుంచి దూరం పెడుతామని అన్నారు.

TN ministers should be resigned his post says Thanga Tamil Selvan

ఈ సమయంలో టీటీవీ దినకరన్ ఇద్దరు మంత్రుల వెనుక ఎవరో ఉన్నారని, వారే ఇలా మాట్లాడిస్తున్నారని చెప్పారు. మంగళవారం టీటీవీ వర్గంలోని ఎమ్మెల్యే తంగ తమిళ సెల్వన్ మీడియాతో మాట్లాడుతూ శశికళ, టీటీవీ దినకరన్ పుణ్యమా అంటూ జయకుమార్, దిండుగల్ శ్రీనివాస్ కు మంత్రి పదవులు వచ్చాయని, వారిని విమర్శించే వారు వెంటనే వారి పదవులకు రాజీనామా చెయ్యాలని సవాలు చేశారు. అయితే తంగ తమిళ సెల్వన్ మాటలను ఇద్దరు మంత్రులు గాలికి వదిలేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tamil Nadu Ministers Jayakumar, Dindugul Sreenivasan immediate resigns their party post said TTV Dinakaran support MLA Thangatamil selvan.
Please Wait while comments are loading...