అజిత్ అప్పుడే చెప్పారు, కమల్‌కు దమ్ముందా: మంత్రి, నన్ను బెదిరించాలని స్టాలిన్

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: నటుడు కమల్‌హాసన్‌పై తమిళనాడు ఆర్థిక శాఖ మంత్రి జయకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి వచ్చే ధైర్యముందా అని సవాల్ విసిరారు.

కమల్‌హాసన్‌కు ధైర్యం ఉంటే రాజకీయాల్లోకి రావాలని, అప్పుడు రాజకీయ వ్యవస్థ గురించి మాట్లాడవచ్చునని జయకుమార్‌ అన్నారు. కమల్‌ అనవసరంగా ప్రభుత్వ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారన్నారు.

TN ministers ‘threat’ to Kamal Haasan: Why don’t they threaten me, asks Stalin

ఆయనకు డీఎంకే మద్దతిస్తోందని ఆరోపించారు. మరో మంత్రి షణ్ముగం మాట్లాడుతూ కమల్‌కు అంత ధైర్యమే ఉంటే జయలలిత అధికారంలో ఉన్నప్పుడు అవినీతి గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నటుడు అజిత్‌ ఆయన సమక్షంలోనే బహిరంగంగా మాట్లాడారని, అధికార పార్టీతో సన్నిహితంగా ఉన్న కొందరు నటులపై బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. కానీ కమల్‌ అమ్మ బతికి ఉన్న సమయంలో ఎందుకు ప్రశ్నించలేదన్నారు.

అన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతి వేళ్లూనుకుందని కమల్‌ హాసన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రులు విమర్శలకు దిగడంపై డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ స్పందించారు.

ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిన విషయాన్ని తాను ఇంతకుముందు ప్రస్తావించినప్పటికీ తనను ఎందుకు బెదిరించడం లేదని, తనపై కేసులు ఎందుకు పెట్టడం లేదంటూ ప్రశ్నించారు.

కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు ఆయనను ఎందుకు భయపెడుతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు అందరిలాగే కమల్ హాసన్‌కు ఉందన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
DMK working president MK Stalin+ said on Monday that he has been stating for long that the Tamil Nadu government is steeped in corruption but the government has neither threatened him nor filed a case against him. However, the ministers are threatening actor Kamal Haasan for saying that no government department is free from corruption, Stalin said.
Please Wait while comments are loading...