TN Seshan:రాజకీయ నేతలకు సింహస్వప్నం..ఎన్నికల వ్యవస్థలో టీఎన్ శేషన్ మార్క్..!!

ప్రస్తుతం భారత ఎన్నికల సంఘం పనితీరు,ప్రస్తుత ఎన్నికల కమిషన్ నిర్ణయాలపై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాలు,వివాదాలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించడం ఎలాగో నేర్పిన అపర చాణక్యుడు,మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) టీఎన్ శేషన్ గుర్తుకు రావడం సహజం.అధికారం ముందు తలవంచని ఆయన నిబద్ధతతో కూడిన శైలి నేటికీ ఒక అద్భుత ఆదర్శంగా నిలుస్తోంది.

1990లో దేశ 10వ సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన శేషన్,భారత ఎన్నికల ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేశారు.అప్పటివరకు నామమాత్రంగా ఉన్న ఎన్నికల నియమావళిని కఠినంగా అమలు చేశారు.ఓటరు గుర్తింపు కార్డులు (ఓటర్ ఐడీ) ప్రవేశపెట్టడం,ప్రచార ఖర్చులపై పరిమితులు విధించడం,అంగబలం, అర్థబలాన్ని అరికట్టేందుకు ఆయన తీసుకున్న చర్యలు విప్లవాత్మకమైనవి. బూత్ ఆక్రమణలు, హింస జరిగే ప్రాంతాల్లో ఎన్నికలను తక్షణమే నిలిపివేయడానికి కూడా ఆయన వెనుకాడలేదు.

t-n-seshan-remembered-how-the-election-lion-changed-indian-elections-could-india-see-another-sesha

నాయకులకు సింహస్వప్నం.. వ్యవస్థకు రక్షణ కవచం

ఒకప్పుడు నామమాత్రపు హోదాకే పరిమితమైన ఎన్నికల కమిషన్ కు రాజ్యాంగం ఇచ్చిన అసలైన అధికారాలను శేషన్ ప్రపంచానికి పరిచయం చేశారు.ఓటర్ గుర్తింపు కార్డులు లేకపోతే ఎన్నికలే పెట్టనని భీష్మించుకూర్చొని సాధించారు.బూత్ క్యాప్చరింగ్,మద్యం,డబ్బు పంపిణీ,గోడలపై రాతల నిరోధానికి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కఠినంగా అమలు చేశారు.రాజకీయ నాయకులను ఉద్దేశించి శేషన్ బిగ్గరగా చెప్పిన మాటలు ఇప్పటికీ మారుమోగుతాయి

"I eat politicians for breakfast!"(నేను టిఫిన్ కింద రాజకీయ నాయకులను తింటాను) అధికారులకు స్వతంత్రతను నొక్కిచెబుతూ ఆయన అన్న మరో మాట కూడా ఇప్పటికీ గుర్తుండిపోతుంది."Show me where in the Constitution it says the Election Commission must obey the government."(రాజ్యాంగంలో ఎక్కడైనా ఎన్నికల సంఘం ప్రభుత్వానికి లొంగి ఉండాలని ఉందేమో చూపించండి)

Breaking: 48 గంటల్లో సీఈసీ రాజీనామా- తేడా వస్తే దేశవ్యాప్త ఉద్యమం- కాక్రోచ్ అల్టిమేటం..!
Breaking: 48 గంటల్లో సీఈసీ రాజీనామా- తేడా వస్తే దేశవ్యాప్త ఉద్యమం- కాక్రోచ్ అల్టిమేటం..!

పీవీ,జయలలితలతో ఢీ..సుప్రీంకోర్టు సవాల్

ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ఆనాటి దేశ ప్రధాని పీవీ నరసింహారావు,తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వంటి పటిష్టమైన నాయకుల నిర్ణయాలను సైతం శేషన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదని నిరూపించారు.శేషన్ దూకుడికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ స్థానంలో బహుళ సభ్య కమిషన్‌ను తీసుకువచ్చింది.దీనిపై శేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించి,ఎన్నికల సంఘం అత్యున్నత అధికారాల రక్షణ కోసం గట్టిగా పోరాడారు.దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం ఈ విషయంలో చారిత్రాత్మక ఆదేశాలను జారీ చేసింది.ఈ న్యాయపోరాటం ద్వారా ఎన్నికల కమిషన్‌ ఒక బలిష్టమైన స్వతంత్ర రాజ్యాంగ శక్తిగా అవతరించింది.ప్రచార నిబంధనలను ఉల్లంఘించిన కేంద్ర మంత్రులను సైతం నిలదీశారు

ఇదంతా పక్కా ప్లాన్-CEC తప్పుకోవాల్సిందే..! రాహుల్ డిమాండ్..!
ఇదంతా పక్కా ప్లాన్-CEC తప్పుకోవాల్సిందే..! రాహుల్ డిమాండ్..!

తమిళనాడులో నాటి ముఖ్యమంత్రి జయలలిత హెచ్చరికలను సైతం లెక్కచేయకుండా,శాంతిభద్రతల నెపంతో ఎన్నికలను వాయిదా వేసి తన సత్తా చాటారు.ఎన్నికల నిర్వహణలో కేంద్ర దళాల మోహరింపును తప్పనిసరి చేసి పారదర్శకతకు పెద్దపీట వేశారు.తన పదవీ కాలంలో అవినీతి అక్రమాలను అరికట్టేందుకు శేషన్ చూపిన చొరవ అసాధారణమైనది.నాయకులు ఎంతటి అధికారం కలిగి ఉన్నా,చట్టం ముందు అందరూ సమానులే అని ఆయన ప్రతి అడుగులోనూ నిరూపించారు.ఎన్నికల నియమాలను ఉల్లంఘించే అభ్యర్థులపై అనర్హత వేటు వేయడం ద్వారా,రాజకీయాల్లో విలువలు కాపాడటానికి శేషన్ అహర్నిశలు శ్రమించారు.ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలే నేటికీ భారత ప్రజాస్వామ్యానికి బలమైన పునాదులుగా నిలిచాయి.

నేడు ఎన్నికల కమిషన్ స్వతంత్రతపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో,టీఎన్ శేషన్ సంస్కరణల ప్రాధాన్యత మరింత స్పష్టంగా అర్థమవుతుంది.వ్యవస్థలపై ప్రజలకు విశ్వాసం కలగాలంటే అధికారులకు నిబద్ధత,శేషన్ తరహా ధైర్యం ఎంతో అవసరమని విశ్లేషకులు భావిస్తున్నారు. భారతదేశ ఎన్నికల చరిత్ర ఉన్నంత కాలం ప్రజాస్వామ్య రక్షకుడిగా శేషన్ పేరు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+