షాక్: రెబల్ ఎమ్మెల్యేలకు ముచ్చటగా మూడో సారి నోటీసులు ఇచ్చిన స్పీకర్; అనర్హత వేటు !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడులోని ఎడప్పాడి పళనిసామి మీద తిరుగుబాటు చేసిన అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలకు ఆ రాష్ట్ర శాసన సభ స్పీకర్ ధనపాల్ శుక్రవారం ముచ్చటగా మూడో సారి నోటీసులు జారీ చేశారు. వ్యక్తిగతంగా తన ముందు హాజరై వివరణ ఇవ్వాలని స్పీకర్ ధనపాల్ స్పష్టంగా సూచించారు.

సీఎం మీద పగ: గవర్నర్ విద్యాసాగర్ రావ్ కరుణించారు, టీటీవీ దినకరన్ కు ఒక్క చాన్స్ !

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి మీద తిరుగుబాటు చేసి అన్నాడీఎంకే పార్టీ బహిష్కరించిన టీటీవీ దినకరన్ గ్రూప్ లో చేరి పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్థిస్తున్న ఎమ్మెల్యేల మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఆ పార్టీ చీఫ్ విప్ రాజేంద్రన్ స్పీకర్ ధనపాల్ కు ఫిర్యాదు చేశారు.

TN Speaker Danapal sent notice to TTV Dinakaran faction MLAs

ఇప్పటికే రెండు వారాల్లో రెండు సార్లు స్పీకర్ ధనపాల్ అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలని సూచించారు. టీటీవీ దినకరన్ గ్రూప్ లోని ఎమ్మెల్యేలు స్పీకర్ ఆదేశాలు గాలికి వదిలేసి రిసార్ట్ రాజకీయాలు చేస్తున్నారు.

నడి రోడ్డులో ఏసీపీ కామపిచ్చి: మహిళా ఎస్ఐ మీద చెయ్యి ఎక్కడ వేశాడంటే (వీడియో)

మూడో సారి జారీ చేసిన నోటీసులకు అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల నుంచి స్పందనలేకపోతే వారి మీద అనర్హత వేటు పడే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు. శాసన సభ సమావేశంలో ఎడప్పాడి పళనిసామి బలపరీక్ష నిర్వహించినా రెబల్ ఎమ్మెల్యేలు ఓటు వెయ్యడానికి అనర్హులు అయ్యే అవకాశం ఉందని స్పష్టంగా కనపడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tamil Nadu Speaker Danapal sent notice to TTV Dinakaran faction MLAs and asking to appear in person.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి