త్రిపురలో ఉన్నతాధికారులు తెలుగువారే, టీ ఆనందం

వారితో తెలుగులోనే మాట్లాడి ఆ రాష్ట్రం ఏవిధంగా అభివృద్ధి చెందుతున్నదీ అడిగి తెలుసుకున్నారు. త్రిపురలోని సచివాలయాన్ని సందర్శించి ఉద్యోగులతోను మాట్లాడారు. అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు టీఎన్జీవో అధ్యక్షులు దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి తదితరులు త్రిపుర రాజధాని అగర్తాలకు వెళ్లారు.
అక్కడ ఈ నెల 12వ తేదీ నుండి నిర్వహిస్తున్న సమావేశాల్లో వారు పాల్గొన్నారు. చిన్న రాష్ట్రమైన త్రిపురలో అభివృద్ధి తీరు పైన తెలంగాణ ప్రభుత్వానికి త్వరలో టీఎన్జీవో నేతలు ఓ నివేదిక అందజేయాలని భావిస్తున్నారు. త్రిపుర రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కామేశ్వర రావు, డీజీపీ నాగరాజ్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి నాగరాజారావులను కలిసి అభివృద్ధి పైన తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications