మీడియాకి దొరకకుండా పరుగెత్తి గదిలో గడియ పెట్టుకున్నాడు
బెంగళూరు: కర్నాటక చీఫ్ సెక్రటరీ (సీఎస్) అరవింద్ జాదవ్ మీడియాకు చిక్కకుండా పరుగెత్తి, గదిలోకి వెళ్లి బోల్ట్ పెట్టుకున్న సంఘటన ఇటీవల జరిగింది. మీడియాను చూసి ఆయన పరుగు అందుకోవడం చర్చనీయాంశమైంది.
కర్ణాటకలో పార్లమెంటు సభ్యులకు కేటాయించిన నిధులపై ఆ రాష్ట్ర సచివాలయంలో లోకసభ డిప్యూటీ స్పీకర్ తంబి దురై అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కర్ణాటక సీఎస్ జాదవ్ 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు.

అలా వచ్చారో లేదో మీడియాను చూసి పరుగు పెట్టారు. మూడవ ఫ్లోర్‌లో ఉన్న తన కార్యాలయంలోకి వెళ్లారు. తన కార్యాలయానికి చేరుకుని లోపలి నుంచి గడియ పెట్టుకున్నారు. ఆయన పరుగు పెట్టడానికి కారణం.. ఆలస్యంగా వచ్చిన తనను మీడియా ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తారని అలా పారిపోయారట.












Click it and Unblock the Notifications