దారుణం: వేడి వేడి పాలు మీద పడి చిన్నారి మృతి

న్యూఢిల్లీ: ఇంట్లో పసిపిల్లలుంటే అనునిత్యం వారిని కంటికి రెప్పలా కాపాడుతూ ఉండాలి. ప్రతి క్షణం కూడా వారిపై ఓ కన్నేసి ఉండాలి. ఎందుకంటే ఏ చిన్న పొరపాటు జరిగినా మనం భారీ మాల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కాబట్టి.

చిన్న చిన్న పొరపాట్లే నిండు జీవితాన్ని బలితీసుకుంటుంది. తాజాగా అలాంటి దురదృష్టకర సంఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఏడాదిన్నర వయసు కలిగిన ఓ చిన్నారి మీద వేడి వేడి పాలు పడటంతో ప్రాణాలు కోల్పోయింది.

 Toddler dies after hot milk spills over her

ఈ సంఘటన అదివారం రాత్రి చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పాలను వేడి చేసిన చిన్నారి తల్లి అవి చల్లబడేందుకు గాను హాలులో ఫ్యాన్ కింద ఉంచి వేరే పనిలో నిమగ్నమైంది. అయితే ఆ విషంయ తెలియని చిన్నారి ఆడుకుంటూ ఆ పాల గిన్నెను తనపై పోసుకుంది.

దీంతో చిన్నారి అరుపులు విన్న ఆ కన్న తల్లి హుటాహుటిన సమీప ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చిన్నారి శరీరం యాభై శాతం కాలిపోవడంతో చికిత్సకు సహకరించక మృత్యువాత పడింది. ఆ కుటుంబ సభ్యులే కాకుండా ఇరుగుపొరుగు వాళ్లు కూడా ఈ ఘటనను చూసి కన్నీటిపర్యంతమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+