వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొబైల్స్ వల్లే బాలికలపై అత్యాచారాలు: యూపీ మంత్రి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండే ఉత్తరప్రదేశ్ మంత్రి అజాం ఖాన్ మరోసారి తనదైన శైలిలో స్పందించారు. మొబైల్ ఫోన్సే ఢిల్లీలో రెండేళ్ల చిన్నారిపై ఇద్దరు టీనేజర్లు అత్యాచారం జరపడానికి కారణమయ్యాయని పేర్కొన్నారు.

'రెండేళ్ల చిన్నారిపై జరిగిన లైంగిక దాడి ఘటన వెనుక వాస్తవాన్ని మనం గుర్తించాలి. ఆ వాస్తవం ఏమిటంటే మొబైల్ ఫోన్. అందులో ఎలాంటి ఖర్చు లేకుండా చూడగలిగే విషయాలు. గ్రామీణ ప్రాంతాల్లో 14, 15 ఏళ్ల బాలలు సైతం మొబైల్ ఫోన్స్‌ని వినియోగిస్తున్నారు. ఈ ఫోన్లలో రెండేళ్ల చిన్నారులకు సంబంధించిన అభ్యంతరకరమైన వీడియోలు సైతం ఉంటున్నాయి' అని ఆయన ఓ మీడియా సంస్థతో పేర్కొన్నారు.

Toddler Rapes Because of Mobile Phones, says Uttar Pradesh Minister Azam Khan

'మొబైల్‌ ఫోన్‌ని మనం ఎలా ఎదుర్కొంటున్నాం? ఎలా శిక్షిస్తున్నాం? ఈ వీడియోలు యావత్ యువతరాన్ని నాశనం చేస్తున్నాయి. వాళ్లు యుక్త వయస్సులోకి రాకముందే వారిపై ఈ వీడియోలు ప్రభావాన్ని చూపుతున్నాయి' అని ఆయన పేర్కొన్నారు.

అజాంఖాన్ చేసిన వ్యాఖ్యలకు గాను జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సైతం ట్విట్టర్‌లో సమాధానమిచ్చారు. 'స్మార్ట్‌ ఫోన్లు రాకముందు మన దగ్గర అత్యాచారాలు, దుర్మార్గాలు లేవు కదా' అంటూ చమత్కరించారు.

కాగా, గత శుక్రవారం నాడు ఢిల్లీలో రామ్‌లీలా షో జరుగుతుండగా ఇద్దరు బాలురు రెండేళ్ల బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బాధిత చిన్నారి ఒంటికి తీవ్రగాయాలు అవడంతో పాటు, బాలిక తీవ్ర రక్తస్రావానికి గురైంది. సీసీటీవీ పుటేజి ఆధారంగా నిందితులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

English summary
Uttar Pradesh minister Azam Khan, who is known for his outrageous comments, today said the mobile phone is to be blamed for incidents like the rape of a two-year-old, allegedly by teenage boys in Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X